STOCKS

News


68.91 వద్ద రూపీ ప్రారంభం

Monday 22nd July 2019
Markets_main1563769622.png-27213

విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల నిరంతర అమ్మకాల మధ్య బ్యాంకులు, దిగుమతిదారులు అమెరికన్ కరెన్సీని కొనుగోలు చేయడంతో  రూపాయి సోమవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే 10 పైసలు బలహీనపడి 68.91 వద్ద ప్రారంభమైంది. ఈక్విటీ మార్కెట్లలో ఎఫ్‌ఐఐలు అమ్మకాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ నెలలో ఎఫ్ఐఐలు ఈక్విటీ విభాగంలో 110 కోట్ల డాలర్ల అమ్మకాలు జరిపారు. రూపీ డాలర్‌ మారకంలో శుక్రవారం  16 పైసలు బలపడి 68.81 వద్ద ముగిసింది. ఈ నెల చివరిలో జరగనున్న  ఫెడరల్ రిజర్వ్ సమావేశం జరగనుండడంతో రూపీ తక్కువ మార్జిన్‌లో కదలాడవచ్చని విశ్లేషకులు తెలిపారు.  ఈ రోజు రూపీ డాలర్‌ మారకంలో 68.65 నుంచి  69.05-69.20 పరిధిలో కదలాడవచ్చని బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తెలిపింది.
 You may be interested

ఆటో షేర్లు లాభాల్లో..

Monday 22nd July 2019

 నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ సోమవారం ట్రేడింగ్‌లో 1.12 శాతం లాభపడి 7,273.25 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో  హీరో మోటర్‌ కార్ప్‌ 2.55 శాతం, మారుతి 2.36 శాతం, టాటా మోటర్స్‌ 1.91 శాతం, అశోక్‌ లేలాండ్‌ 1.39 శాతం, ఎంఆర్‌ఎఫ్‌ 1.23 శాతం, అమర్‌రాజా బ్యాటరీస్‌ 1.20 శాతం, బజాజ్‌ ఆటో 0.91 శాతం, ఎం అండ్‌ ఎం 0.74 శాతం,  భారత్‌ ఫోర్జ్‌ మాత్రం 0.73

రిలయన్స్‌ పాజిటివ్‌.... హెచ్‌డీఎఫ్‌సీ నెగిటివ్‌

Monday 22nd July 2019

గతవారం చివర్లో క్యూ1 ఫలితాలను ప్రకటించిన హెవీవెయిటేజీ షేర్లైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు సోమవారం ట్రేడింగ్‌లో మిశ్రమంగా ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.  రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌:- మార్కెట్‌ వర్గాల అంచనాలకు మించి ఫలితాలను నమోదుచేయడం‍తో రిలయన్స్‌ షేర్లు  0.65శాతం లాభంతో రూ. 1256.95 ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్‌ ఆరంభంలో ఈ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇంట్రాడేలో 1.35శాతం ర్యాలీ చేసి రూ.1265.80 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. ఉదయం గం.9:30ని.లకు

Most from this category