News


24 పైసలు బలపడిన రూపీ

Tuesday 22nd October 2019
Markets_main1571719712.png-29045

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో మంగళవారం సెషన్లో 24 పైసలు బలపడి 70.90 వద్ద ప్రారంభమైంది. కాగా అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరలు పడిపోవడంతో శుక్రవారం సెషన్‌లో రూపీ-డాలర్‌ మారకంలో స్వల్పంగా బలపడి 71.14  వద్ద ముగిసింది. తక్షణ డాలర్‌-రూపీ జంటకు 70.70-70.50 పరిధిలో మద్ధతు లభించే అవకాశం ఉందని, 72 స్థాయి వద్ద నిరోధం ఎదురుకానుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యురిటీస్‌ తెలిపింది. ‘ అక్టోబర్‌ ఆప్సన్‌ పంపిణీ ప్రకారం రూపీకి డాలర్‌ మారకంలో 72-72.50 పరిధిలో నిరోధం ఎదురయ్యే అవకాశం ఉంది. 70.50 స్థాయి మద్ధతు స్థాయిగా పనిచేస్తుంది. సెంట్రల్‌ బ్యాంకులు డాలర్‌లను కొనుగోలు చేస్తుండడంతో డాలర్‌కి డిమాండ్‌ పెరుగుతోంది. ఫలితంగా రూపీ డాలర్‌ మారకంలో మరింత పడిపోయే అవకాశం ఉంది’ అని ఈ బ్రోకరేజి వివరించింది. 



You may be interested

ఇన్ఫోసిస్‌పై బ్రోకరేజ్‌లు ఏమంటున్నాయ్‌?...

Tuesday 22nd October 2019

విజిల్‌బ్లోయర్స్‌ పేరిట కొందరు ఉద్యోగులు ఇన్ఫీమేనేజ్‌మెంట్‌పై చేసిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో మంగళవారం షేరు దాదాపు 15 శాతం వరకు పతనమైంది. ఈ ఆరోపణలపై కంపెనీ స్పందిస్తూ వీటిని కంపెనీ ఆడిట్‌ కమిటీ ముందుంచామని తెలిపింది. కమిటీకి డీ సుందరమ్‌ అధ్యక్షత వహిస్తుండగా, రూపా కుద్వా, పునీత్‌కుమార్‌ సిన్హాలు స్వతంత్ర సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుత సంక్షోభ నేపథ్యంలో ఇన్ఫీ షేరుపై ప్రముఖ బ్రోకరేజ్‌ల స్పందన ఇలా

రిలయన్స్‌ షేరుపై బ్రోకరేజ్‌లు బుల్లిష్‌!

Tuesday 22nd October 2019

సెప్టెంబర్‌ త్రైమాసికంలో మంచి ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరుపై బ్రోకరేజ్‌లు బుల్లిష్‌గా మారాయి. పలు బ్రోకరేజ్‌లు కంపెనీ షేరు టార్గెట్‌ ధరను పెంచాయి. ఆర్‌ఐఎల్‌పై వివిధ బ్రోకింగ్‌ సంస్థల అంచనాలు, అభిప్రాయాలు ఇలా ఉన్నాయి... 1. యూబీఎస్‌: కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ రూ. 1500. కమోడిటీ తలనొప్పులున్నా, కంపెనీ బలమైన ఫలితాలు ప్రకటించింది. పెట్‌కెమ్‌ ఉత్పత్తి రికార్డు గరిష్ఠాలను తాకింది. జియో ఫైబర్‌ ఇన్‌ఫ్రాపై ఎక్కువ దృష్టి పెడుతోంది. 2. కోటక్‌

Most from this category