News


71.78 వద్ద ప్లాట్‌గా ప్రారంభమైన రూపీ

Friday 30th August 2019
Markets_main1567137168.png-28099

దేశియ రూపీ డాలర్‌ మారకంలో శుక్రవారం 71.78 వద్ద ప్లాట్‌గా ప్రారంభమైంది. యుఎస్‌ విధించిన సుంకాలకు ప్రతీకారంగా ఇప్పట్లో యుఎస్‌ దిగుమతులపై టారిఫ్‌లను విధించమని గురువారం చైనా అనడంతో ఇరు దేశాల మధ్య ముదురుతున్న వాణిజ్య ఘర్షణ కొంత సరళతరం అయ్యింది. ఫలితంగా గత సెషన్‌లో రూపీ డాలర్‌మారకంలో 3 పైసలు బలహీనపడి 71.80 ముగిసింది. గత పది రోజుల నుంచి డాలర్‌మారకంలో నష్టపోతున్న చైనా కరెన్సీ యువాన్‌ గురువారం 0.20 శాతం బలపడడం గమనార్హం. డాలర్‌-రూపీ సెప్టెంబర్‌ కాంట్రాక్ట్‌ గత సెషన్‌లో 71.98 గా ఉందని, ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ 1.19 శాతం తగ్గిందని ఐసీఐసీఐ డైరక్ట్‌ తెలిపింది. డాలర్‌-రూపీ మారకంలో అధిక స్థాయిల వద్ద ఒత్తిడి ఉండే అవకాశం ఉందని, దీనిని షార్ట్‌ పొజిషన్‌లను తీసుకోడానికి వినియోగించుకోవాలని ఈ బ్రోకరేజి తెలిపింది.



You may be interested

లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్‌

Friday 30th August 2019

దేశీయ ఈక్విటీ మార్కెట్‌ శుక్రవారం లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 153 పాయింట్లు లాభంతో 10,987.80 వద్ద, నిఫ్టీ 40 పాయింట్లు లాభంతో 10,987.80 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అమెరికా మార్కెట్లు వరుసగా రెండురోజూ లాభాల్లో ముగియడంతో పాటు, నేడు ఆసియాలో పలు ప్రధాన సూచీలు పాజిటివ్‌ ట్రేడ్‌ అవుతుండటం, అంతర్జాతీయంగా సెంటిమెంట్‌ కొంత మెరుగైంది. నేడు సెప్టెంబర్‌ నెల డెరివేటివ్స్‌ కాంట్రాక్ట్స్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో ట్రేడర్లు కొత్త పొజిషన్లు

మార్కెట్లకు కొత్త శిఖరాలు ఇప్పట్లో లేనట్టే..!??

Thursday 29th August 2019

నిపుణుల అంచనాలు ‘దేశీయ స్టాక్స్‌ వచ్చే ఏడాది పెరగొచ్చు.. కానీ ఇటీవలి నష్టాలను పూడ్చుకునే స్థాయిలో కాదు’... రాయిటర్స్‌ సంస్థ నిర్వహించిన పోల్‌లో ఎక్కువ మంది నిపుణులు చెప్పిన అభిప్రాయం ఇది.  ప్రస్తుత ఆర్థిక మందగమనం, బలహీన కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌ విషయంలో వీరు ఆందోళన వ్యక్తం చేశారు. బీఎస్‌ఈ ఈ ఏడాది ఇప్పటి వరకు 4 శాతం పెరగ్గా... జూన్‌లో జీవితకాల గరిష్ట స్థాయి నుంచి చూస్తే 10 శాతం పడిపోయింది.

Most from this category