News


ప్లాట్‌గా ప్రారంభమైన రూపీ

Tuesday 26th November 2019
Markets_main1574740729.png-29852

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో మంగళవారం సెషన్‌లో 5 పైసలు బలపడి 71.68 వద్ద ప్రారంభమైంది. కాగా గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో ప్లాట్‌గా 71.74 వద్ద ముగిసింది. చమురు ధరలు పెరగడంతో పాటు, అంతర్జాతీయంగా డాలర్‌ బలపడడం వంటి అంశాలు రూపీ సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి. యుఎస్‌-చైనా మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న ట్రేడ్‌వార్‌కు వాణిజ్య ఒప్పందంతో తొందరలో ముగింపు దొరుకుతుందనే అంచనాలు పెరిగాయి. ఫలితంగా గత సెషన్‌లో లాభాల్లో కదిలిన  చమురు ధరలు, మంగళవారం సెషన్‌లో కూడా పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. వాణిజ్య ఒప్పందం కుదురుతుందనే అం‍చనాలు పెరగడంతో జపాన్‌ యెన్‌తో పోలిస్తే, డాలర్‌ బలపడింది. బ్రిటన్‌ హంగ్‌ పార్లమెంటుకు ముగింపు దొరుకుతుందనే అంచనాలుండడంతో పౌండ్‌ పాజిటివ్‌గా ఉంది. గత సెషన్‌లో ఎన్‌ఎస్‌ఈలో డాలర్‌-రూపీ నవంబర్‌ కాంట్రాక్ట్‌ 71.73 వద్ద ఉందని, ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ 10.36 శాతం తగ్గిందని ఐసీఐసీఐ డైరక్ట్‌ పేర్కొంది. డాలర్‌-రూపీ జంట అధిక స్థాయిల వద్ద సరఫరా ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉం‍దని, దీనిని షార్ట్‌ పొజిషన్లు తీసుకోడానికి వినియోగించుకోవాలని ఈ బ్రోకరేజి సలహాయిచ్చింది. 



You may be interested

41వేల శిఖరంపై సెన్సెక్స్‌, కొత్త గరిష్టంపై నిఫ్టీ ప్రారంభం

Tuesday 26th November 2019

జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల అంశాలతో మంగళవారం సూచీలు కొత్త రికార్డు స్థాయిల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సెన్సెక్స్‌ 133 పాయింట్లు పెరిగి 41వేల శిఖరంపై 41,022 వద్ద మొదలైంది. తన జీవితకాల గరిష్టస్థాయి 12103 స్థాయిని అధిగమించి 37 పాయింట్లు లాభంతో  12,110.20 వద్ద ప్రారంభమైంది.  అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఒప్పందంపై ఆశావహన అంచనాలతో నిన్నరాత్రి అమెరికా మార్కెట్ల రికార్డు ముగింపు, నేటి ఉదయం ఆసియా మార్కెట్ల లాభాల

విచారణకు రాకుంటే.. వారంటు జారీ చేస్తాం!!

Tuesday 26th November 2019

యాక్సిస్‌, స్టాన్‌చార్ట్‌ సీఈవోలకు ఎన్‌సీఎల్‌టీ హెచ్చరిక ముంబై: ఇన్‌ఫ్రా రుణాల సంస్థ ఐఎల్‌అ౾ండ్ఎఫ్‌ఎస్ అవకతవకల కేసుకు సంబంధించి యాక్సిస్‌ బ్యాంక్‌, స్టాన్‌చార్ట్ బ్యాంకుల సీఈవోల తీరుపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ఘాటు వ్యాఖ్యలు చేసింది. డిసెంబర్ 16న జరిగే కేసు విచారణకు తప్పనిసరిగా హాజరు కావాలని, రాని పక్షంలో నాన్‌బెయిలబుల్ వారంట్లు జారీ చేయాల్సి వస్తుందని హెచ్చరించింది. యాక్సిస్‌ బ్యాంక్ సీఈవో అమితాబ్ చౌదరి, స్టాన్‌చార్ట్ ఇండియా సీఈవో

Most from this category