News


భారీ పతనం తర్వాత కోలుకున్న రూపీ

Wednesday 4th September 2019
Markets_main1567569530.png-28171

రూపీ డాలర్‌ మారకంలో బుధవారం ట్రేడింగ్‌లో 21 పైసలు బలపడి 72.18 వద్ద ప్రారంభమైంది. దేశియ ఈక్విటీ మార్కెట్లు భారీగా నష్టపోవడంతో పాటు, దేశ జీడీపీ ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోవడం, ఇతర ప్రధాన కరెన్సీలతో పోల్చుకుంటే డాలర్‌ బలపడడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 97 పైసలు బలహీనపడి 9 నెలల కనిష్ఠమైన 72.39 కి చేరుకుంది. ఆర్థిక సంవత్సరం 2020 జూన్‌ త్రైమాసికానికి సంబంధించి దేశ జీడీపీ వృద్ధి రేటు 5 శాతంగా నమోదైంది. ఇది ఆరేళ్ల కనిష్ఠం కావడం గమనార్హం. గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకం‍లో 97 పైసలు బలహీనపడింది. ఇది అగష్టు 5 తర్వాత ఒక సెషన్‌లో అత్యధికంగా పతనం కాగా, 2018 నవంబర్‌ 13 తర్వాత కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం.



You may be interested

ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్‌

Wednesday 4th September 2019

క్రితం రోజు భారీ పతనం అనంతరం మార్కెట్‌ బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమైంది. సెన్సెక్స్‌ గత ముగింపు (36,563)తో పోలిస్తే 8 పాయింట్ల స్వల్పలాభంతో 36,575.24 వద్ద, నిఫ్టీ నిన్నటి ముగింపు (10,798)తో పోలిస్తే 8 పాయింట్ల నష్టంతో 10,790.40 వద్ద ప్రారంభమైంది. జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన సంకేతాలు సూచీలను నష్టాల వైపు మళ్లించాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్‌ నుంచి విదేశీ పెట్టుబడలు కొనసాగుతుండటం, బలహీనమైన ఆర్థిక గణాంకాల నమోదు,

నిఫ్టీ తిరిగి 10,800పైన నిలబడితేనే...?

Wednesday 4th September 2019

ఒక్క రోజే స్టాక్‌ మార్కెట్లు భారీగా కుదేలయ్యాయి. గత శుక్రవారం విడుదలైన దేశ జీడీపీ గణాంకాలు జూన్‌ త్రైమాసికంలో వృద్ధి కేవలం 5 శాతానికి పరిమితం కావడం, ఆగస్ట్‌ నెలలో వాహన అమ్మకాలు గణనీయంగా పడిపోవడం ఇన్వె‍స్టర్ల మూడ్‌ను మార్చేశాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్‌పీఐలు) పూనకం వచ్చి,నట్టు ఒక్క రోజే రూ.2,000 కోట్ల మేర మంగళవారం అమ్మకాలు సాగించారు. దేశీయ ఇనిస్టిట్యూషన్స్‌ రూ.1,200 కోట్ల వరకు కొనుగోలు చేయడం

Most from this category