News


బలపడిన రూపీ

Friday 15th November 2019
Markets_main1573790509.png-29609

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో శుక్రవారం సెషన్‌లో 18 పైసలు బలపడి 71.79 వద్ద ప్రారంభమైంది. కాగా గత సెషన్లో రూపీ డాలర్‌ మారకంలో ప్రారంభ లాభాలను కోల్పోయి 72 స్థాయి దిగువకు పడిపోయింది. సెషన్‌ పూర్తయ్యేనాటికి స్వల్పంగా బలపడి 71.97 వద్ద ముగిసింది. వచ్చే నెల జరగనున్న ఒపెక్‌(చమురు ఉత్పత్తి, ఎగుమతి దేశాలు) సమావేశంలో చమురు ఉత్పత్తి కోతను కొనసాగించనున్నారనే అంచనాలుండడంతో చమురు ధరలు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ ఆర్థిక మందగమన సంకేతాలుండడంతోపాటు, చైనా-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం పురోగతి స్వల్పంగా ఉండడంతో డాలర్‌ బలహీనపడింది. కానీ డాలర్‌కు శుక్రవారం విస్తృత మద్ధతు స్థాయి లభించడం గమనార్హం.



You may be interested

31000 పైకి బ్యాంక్‌ నిఫ్టీ

Friday 15th November 2019

మార్కెట్‌ ప్రారంభంలోనే బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 31000 స్థాయి పైకి ఎగిసింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఈ ఇండెక్స్‌ నేడు 30,912.40 పాయింట్ల ప్రారంభమైంది. అధిక వెయిటేజీ కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇండెక్స్‌ క్రితం ముగింపు(30749.95)తో పోలిస్తే ఒకశాతానికి పైగా లాభపడి 31010.15 వద్ద ఇంట్రాడే

నష్టాల్లో ఆరంభమైన ఐడియా, ఎయిర్‌టెల్‌ షేర్లు

Friday 15th November 2019

గురువారం క్యు2 ఫలితాల్లో భారీ నష్టాలు నమోదు చేసిన టెలికం సంస్థలు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా షేర్లు శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌లో నష్టాల్లో ఓపెనయ్యాయి. ఎయిర్‌టెల్‌  సుమారు ఒక శాతం నష్టంతో ఆరంభమై వెంటనే లాభాల్లోకి మరలింది. ఉదయం 9.19 సమయానికి ఎయిర్‌టెల్‌ దాదాపు 1.13 శాతం లాభంతో 366 రూపాయల వద్ద ట్రేడవుతోంది. మరో దిగ్గజం వొడాఫోన్‌ ఐడియా మాత్రం ఆరంభం నుంచి తీవ్రనష్టాల్లో ట్రేడవుతోంది. ప్రస్తుతం ఆల్‌టైమ్‌

Most from this category