71.86 వద్ద ప్రారంభమైన రూపీ
By Sakshi

రూపీ డాలర్ మారకంలో గురువారం ట్రేడింగ్‌లో 26 పైసలు బలపడి 71.86 వద్ద ప్రారంభమైంది. దేశియ ఈక్విటీ మార్కెట్లు గత సెషన్లో రికవరి అయ్యాక రూపీ కూడా డాలర్ మారకంలో 27 పైసలు బలపడి 72.12 వద్ద ముగిసింది. ‘దేశియ ఈక్విటీ మార్కెట్ పాజిటివ్‌గా ముగియడం, రూపీ బలపడడంలో సహాయపడింది. గత సెషన్లో రూపీ-డాలర్ ఎన్ఎస్ఈ సెప్టెంబర్ కాంట్రాక్ట్ 72.29 గా ఉంది. అదే విధంగా ఓపెన్ ఇంట్రెస్ట్ 2.21 శాతం తగ్గింది’ అని ఐసీఐసీఐ డైరక్ట్ తెలిపింది. రూపీ డాలర్ మారకంలో అధిక స్థాయిల వద్ద నిరోధం ఎదుర్కొంటుందని, దీనిని షార్ట్పొజిషన్లను తీసుకోడానికి వినియోగించుకోవాలని ఈ బ్రోకరేజి తెలిపింది.
You may be interested
పసిడి ర్యాలీకి బ్రేక్..!
Thursday 5th September 2019అమెరికా చైనాల మధ్య వాణిజ్య చర్చల అంశంపై స్పష్టత రావడంతో ప్రపంచ మార్కెట్లో పసిడి ధర గురువారం దిగివస్తుంది. ఆసియాలో నేటి ఉదయం ఔన్స్ పసిడి ధర 10డాలర్ల మేర నష్టపోయి 1,553.80 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. అక్టోబర్ మొదట్లో ఉన్నత స్థాయి చర్చలకు సన్నాహకంగా తమ వాణిజ్య బృందం సెప్టెంబర్ మధ్యలో యుఎస్ వాణిజ్య అధికారలతో చర్చలు జరుపుతుందని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది.
లాభాల్లో కోల్ ఇండియా, టాటాస్టీల్, వేదాంత
Thursday 5th September 2019యుఎస్- చైనా ఇరు దేశాల అధ్యక్షులు ఉదయం ఫోన్లో మాట్లాడారని, అంతేకాకుండా అక్టోబర్ ప్రారంభంలో మరో రౌండ్ వాణిజ్య చర్చల కోసం సమావేశానికి అంగీకరించారని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లు పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. దీంతోపాటు దేశియ బెంచమార్క్ సూచీలు కూడా సానుకూలంగా ట్రేడవుతుండడంతో ఉదయం 9.55 సమయానికి నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 2.38 శాతం లాభపడి 2,308.30 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో