News


29 పైసలు నష్టపోయిన రూపీ

Wednesday 13th November 2019
Markets_main1573618293.png-29550

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో బుధవారం సెషన్లో 29 పైసలు బలహీనపడి 71.75 వద్ద ప్రారంభమైంది. కాగా యుఎస్‌-చైనా వాణిజ్య ఒప్పందం ఖరారుపై అనుమానాలు రావడంతోపాటు, హాంగ్‌కాంగ్‌లో రాజకీయ అనిశ్చితి వలన సోమవారం సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 19 పైసలు న‍ష్టపోయి  71.46 వద్ద ముగిసింది. గురునానక్‌ జయంతి సందర్భంగా మంగళవారం(నవంబర్‌ 12) సెషన్‌లో ఫారెక్స్‌ మార్కెట్లు పనిచేయలేదు. 
  ‘యుఎస్‌-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారయ్యే అవకాశాలు అధికంగా ఉండడంతో సమీప కాలంలో రూపీ డాలర్‌ మారకంలో బలపడే అవకాశం ఉంది. కానీ డిసెంబర్‌ 6 న సమావేశం కానున్న ఒపెక్‌(చమురు ఉత్పత్తి, ఎగుమతి దేశాలు), చమురు ఉత్పత్తి కోతకు మొగ్గుచూపితే చమురు ధరలు పెరుగుతాయి. ఇది రూపీని ఒత్తిడిలోకి నెడుతుంది’ అని చాయిస్‌ బ్రోకింగ్‌ తెలిపింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లు గత కొన్ని వారాల నుంచి పుంజుకున్నట్టు కనిపిస్తున్నప్పటికి, రూపీపై అంతర్జాతీయ అంశాలు  ప్రభావం చూపే అవకాశం అధికంగా ఉంది. దిపావళి పండుగ సీజన్‌ పూర్తవ్వడంతో బంగారం ధరలు కూడా స్థిరంగా కదులుతున్నాయి. ఇది కూడా రూపీపై ప్రభావం చూపుతుంది. అయినప్పటికి ఆర్థిక వ్యవస్థ పుంజుకోడంపై దేశీయ మార్కెట్లు ఆశపెట్టుకోవడంతో రూపీ లాభాలు పరిమితంగా ఉండే అవకాశం ఉంది. ‘ఈ కారణాల వలన డాలర్‌ మారకంలో రూపీ బుల్లిష్‌ ధోరణి తగ్గుతుంది. రూపీ డాలర్‌ మారకంలో 70.56-72.62 పరిధిలో కదులుతుందని అంచనావేస్తున్నాం’ అని ఈ బ్రోకరేజి తెలిపింది. యుఎస్‌-చైనా వాణిజ్య ఒప్పందం ఖరారుపై అనుమానాలు వెలువడుతుండడంతో చమురు ధరలు బుధవారం ట్రేడింగ్‌లో నష్టాల్లో ట్రేడవుతున్నాయి. 



You may be interested

మరొక విజిల్‌బ్లోయర్‌తో ఇన్ఫీ 1% డౌన్‌

Wednesday 13th November 2019

ఇన్ఫోసిస్‌ సీఈవో సలీల్ పరేఖ్‌కు వ్యతిరేకంగా మరొక విజిల్‌ బ్లోయర్‌ కంపెనీ చైర్మన్‌కు, స్వతంత్ర బోర్డు డైరక్టర్లకు లేఖ రాయడంతో బుధవారం సెషన్‌లో ఇన్ఫోసిస్‌ షేరు విలువ 1 శాతం మేర నష్టపోయి ప్రారంభమైంది. ఉదయం 9.52 సమయానికి ఇన్ఫోసిస్‌ షేరు 1.24 శాతం నష్టపోయి రూ. 695.65 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో రూ. 704.40 వద్ద ముగిసిన ఈ షేరు, బుధవారం సెషన్లో రూ. 696.50 వద్ద

ఫండ్‌మేనేజర్లు కొనేస్తున్నారు!

Wednesday 13th November 2019

ఈక్విటీలపై పెరుగుతున్న బుల్స్‌ పట్టు బోఫాఎంఎల్‌ సర్వేలో వెల్లడి ఇప్పటివరకు నగదు నిల్వలు అట్టిపెట్టుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చిన గ్లోబల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ మేనేజర్లు తాజాగా షేర్ల కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరీలించ్‌ సర్వే తెలిపింది. ఇప్పుడు కొనకపోతే ర్యాలీ మిస్సవుతామన్న భయంతో ఫండ్‌ మేనేజర్లు కొనుగోళ్లకు ప్రాధాన్యం పెంచారని తెలిపింది. అంతర్జాతీయ మందగమన భయాలు సమసిపోయాయని, బుల్స్‌ మళ్లీ పగ్గాలు చేపట్టారని, ఫోమో(ఫియర్‌ ఆఫ్‌ మిస్సింగ్‌ అవుట్‌- ఇప్పుడు

Most from this category