News


ప్లాట్‌గా ప్రారంభమైన రూపీ!

Monday 25th November 2019
Markets_main1574658750.png-29831

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో సోమవారం సెషన్లో స్వల్పంగా పెరిగి 71.69 వద్ద ప్రారంభమైంది. రూపీ శుక్రవారం సెషన్‌లో 71.71 వద్ద ముగిసింది. యుఎస్‌-చైనా వాణిజ్య చర్చలకు సంబంధించి అనేక వార్తలు వెలువడడంతో సోమవారం సెషన్‌లో డాలర్‌, ఎగుమతి కేంద్రీకృత కరెన్సీలు బలపడ్డాయి. అంతేకాకుండా బ్రెగ్జిట్‌పై ఆశలు పెరగడంతో బ్రిటన్‌ పౌండ్‌ బలపడింది. ‘యుఎస్‌-చైనా వాణిజ్య ఒప్పందం ఆలస్యమవుతుండడంతో ఇన్వెస్టర్ల ఆసక్తి తగ్గుతోంది. గత వారం రూపీ-డాలర్‌ జంట్‌ ఒక పరిధిలో కదలాడింది. డీల్‌కు సంబంధించి ట్రంప్‌ ప్రభుత్వ విధానాలు రూపీని ఎడ్జ్‌లో ఉంచుతున్నాయి. ఒప్పందం మరింత ఆలస్యమయితే ఇన్వెస్టర్లు రిస్క్‌ తీసుకోడానికి సుముఖంగా ఉండరు’ అని ఎమ్కే గ్లోబల్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌, కరెన్సీ హెడ్‌, రాహుల్‌ గుప్తా అన్నారు. ‘ఈ వారం రూపీ-డాలర్‌ 71.55-72.25 పరిధిలో ట్రేడవుతుంది. యుఎస్‌-చైనా ట్రేడ్‌ డీల్‌కు సంబంధిం‍చి స్పష్టత వచ్చేంత వరకు 72 స్థాయి కీలక నిరోధంగా పని చేస్తుంది’ అని ఆయన తెలిపారు. యుఎస్‌-చైనా వాణిజ్య ఒప్పందం కుదురుతుందనే అంచనాలు పెరగడంతో సోమవారం సెషన్‌లో ఆయిల్‌ ధరలు పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. 



You may be interested

50రోజుల్లో బీపీసీఎల్‌ ఆస్తుల మదింపు!

Monday 25th November 2019

భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ విక్రయంలో భాగంగా సంస్థ ఆస్తుల విలువ లెక్కించేందుకు ప్రభుత్వం విలువ మదింపుదారుకు 50 రోజుల కాలపరిమితి విధించింది. దీంతో బీపీసీఎల్‌ వాటా విక్రయ ప్రక్రియలో తొలి అడుగు పడినట్లయింది. విలువ మదింపు పూర్తయ్యాక కొనుగోలుదారుల నుంచి బిడ్స్‌ ఆహ్వానిస్తారు. ఈ నెల 20న బీపీసీఎల్‌తో పాటు ఎస్‌సీఐ, టీహెచ్‌డీసీఐఎల్‌, నీప్కోలను మేనేజ్‌మెంట్‌ నియంత్రణతో సహా కొత్త ఇన్వెస్టర్లకు అమ్మేందుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం వేసింది. వీటితో

పేటిఎం అతి పెద్ద నిధుల సమీకరణ!

Monday 25th November 2019

దేశీయ చెల్లింపుల కంపెనీ పేటిఎం తాజాగా 1 బిలియన్‌ డాలర్ల నిధులను ఫైనాన్సింగ్‌ రౌండ్‌ ద్వారా సమీకరించింది. ఈ ఫైనాన్సింగ్‌ రౌండ్‌ యుఎస్‌ ఆస్తి నిర్వహణ సంస్థ టీ రోవ్‌ ఫ్రైస్‌ నేతృత్వంలో జరగగా, కంపెనీ ఇన్వెస్టర్లయిన యాంట్‌ ఫైనాన్సియల్‌, సాఫ్ట్‌ బ్యాంక్‌ విజన్‌ ఫండ్‌ కూడా పాల్గొన్నాయి. ఈ ఏడాది ఇండియన్‌ స్టార్టప్‌ కంపెనీలో జరిగిన అతి పెద్ద నిధుల సమీకరణ ఇదేనని కంపెనీ తెలిపిం‍ది. దీంతో కంపెనీ

Most from this category