News


బలపడిన రూపీ

Monday 18th November 2019
Markets_main1574050684.png-29664

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో సోమవారం సెషన్‌లో 11 పైసలు బలపడి 71.68 వద్ద ప్రారంభమైంది. కాగా దేశీయ ఈక్విటీ మార్కెట్లు పాజిటివ్‌గా ట్రేడవుతుండడంతో పాటు, చమురు ధరలు తగ్గడంతో శుక్రవారం సెషన్‌లో(నవంబర్‌ 15) రూపీ డాలర్‌ మారకంలో 18 పైసలు బలపడి 71.79 వద్ద ముగిసింది. నవంబర్‌ 15 తో ముగిసిన వారంలో రూపీ డాలర్‌ మారకంలో ఏకంగా 50 పైసలు నష్టపోయి 71.79 స్థాయికి చేరుకుంది. ఇది నవంబర్‌ 8 తో ముగిసిన వారంలో 71.29 గా ఉండడం గమనార్హం. 
   యుఎస్‌-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారుపై ఇన్వెస్టర్లు పాజిటివ్‌గా ఉండడంతో గత వారంలో చమురు ధరలు నిలకడగా లాభపడ్డాయి. కానీ చమురు సరఫరా ఆందోళనలు పెరగడంతో సోమవారం సెషన్‌లో చమురు ధరలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. గత సెషన్‌లో డాలర్‌-రూపీ నవంబర్‌ కాంట్రాక్ట్‌ 71.87 వద్ద ఉందని, ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ 1.83 శాతం తగ్గిందని ఐసీఐసీఐ డైరక్ట్‌ పేర్కొంది. డాలర్‌-రూపీ  అధిక స్థాయిల వద్ద సరఫరా ఒత్తిళ్లను ఎదుర్కొనే అవకాశం ఉందని, దీనికి షార్ట్‌ పొజిషన్‌లు తీసుకోడానికి వినియోగించుకోవాలని ఈ బ్రోకరేజి సలహాయిచ్చింది.



You may be interested

వాటా విక్రయ వార్తలతో బీపీసీఎల్‌ 4శాతం ర్యాలీ

Monday 18th November 2019

కేంద్రం వాటా విక్రయ వార్తలతో ప్రభుత్వరంగ సంస్థ బీపీసీఎల్‌ షేరు సోమవారం బీఎస్‌ఈ ఎక్చ్సేంజీలో  2.50శాతానికి పైగా లాభంతో రూ.520.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఒక దశలో 4.50శాతం వరకు లాభపడి రూ.528.00 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఉదయం గం.9:45ని.లకు షేరు క్రితం ముగింపు(రూ505.90)తో పోలిస్తే 2.83శాతం లాభంతో రూ.520.20 వద్ద ట్రేడ్‌ అవుతోంది. షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.261.00, రూ.547.50లు నమోదయ్యాయి. వచ్చే మార్చికల్లా

భారత్‌కు ఆ సత్తా ఉంది..

Monday 18th November 2019

వేగంగా వృద్ధి సాధనపై ఐటీ దిగ్గజం బిల్ గేట్స్‌ వ్యాఖ్యలు ఆధార్‌, యూపీఐ విధానాలపై ప్రశంసలు న్యూఢిల్లీ: రాబోయే దశాబ్ద కాలంలో అత్యంత వేగంగా ఆర్థికాభివృద్ధి సాధించే సత్తా భారత్‌కు ఉందని ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు. దీనితో పెద్ద సంఖ్యలో ప్రజలు పేదరికం నుంచి బైటపడగలరని, విద్య.. వైద్యంపై ప్రభుత్వం మరింత భారీగా పెట్టుబడులు పెట్టడానికి ఆస్కారం ఉంటుందని ఆయన చెప్పారు. ఆధార్, యూపీఐ చెల్లింపుల

Most from this category