News


రూపీ 31 పైసలు డౌన్‌

Wednesday 16th October 2019
Markets_main1571198568.png-28913

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో బుధవారం 5 పైసలు బలహీనపడి 71.59 వద్ద ప్రారంభమైంది. కాగా యుఎస్‌-చైనా మధ్య తాజాగా జరుగుతున్న పరిణామాల వలన డాలర్‌ కొనుగోళ్లు పెరిగాయి. ఫలితంగా రూపీ డాలర్‌ మారకంలో గత సెషన్‌లో 31 పైసలు బలహీనపడి 71.54 వద్ద ముగిసింది. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు అర శాతానికి పైగా పడిపోవడంతో పాటు, దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ముగియడంతో రూపీ పతనం తగ్గింది. యుఎస్‌-చైనా మధ్య కుదిరిన పాక్షిక ఒప్పందానికి సంబంధించి అనిశ్చితి కొనసాగుతుండడంతో రూపీ డాలర్‌ మారకంలో వరుసగా రెండవ సెషన్‌లో కూడా ఒత్తిడిలో ఉందని మోతీలాల్‌ఓస్వాల్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌, ఫారెక్స్‌ అండ్‌ బులియన్‌ విశ్లేషకులు గౌరాంగ్‌ సోమయా అన్నారు. బ్రెక్సిట్‌ సజావుగా సాగడం కోసం ఈ వారంలో కొన్ని కీలక సమావేశాలు జరగనుండడంతో ఈ వారం ప్రధాన కరెన్సీలన్ని ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు. రూపీ ఒత్తిడిలోనే కదిలే అవకాశం ఉందని,  రూపీ డాలర్‌ మారకంలో 71.20, 71.80 పరిధిలో కదలాడవచ్చని తెలిపారు.  



You may be interested

రెండవ నెలలోనూ ఎగుమతులు మైనస్‌

Wednesday 16th October 2019

సెప్టెంబర్‌లో -6.57 శాతం క్షీణత న్యూఢిల్లీ: భారత్‌ ఎగుమతులు వరుసగా రెండవ నెల- సెప్టెంబర్‌లోనూ నిరాశను మిగిల్చాయి. వృద్ధిలేకపోగా -6.57 శాతం క్షీణతను నమోదుచేసుకున్నాయి. విలువ రూపంలో 26 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.  ఇక దేశంలో ఆర్థిక మందగమన పరిస్థితులను ప్రతిబింబిస్తూ, దిగుమతులూ క్షీణతలో కొనసాగుతున్నాయి. - 13.85 శాతం క్షీణతతో 36.89 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి ఎగుమతులు- దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు 10.89 బిలియన్‌ డాలర్లుగా

గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌

Wednesday 16th October 2019

ప్రపంచ మార్కెట్ల సానుకూల సంకేతాల ఫలితంగా బుధవారం భారత్‌ స్టాక్‌ సూచీలు గ్యాప్‌అప్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 125 పాయింట్ల లాభంతో 38,637 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 37 పాయింట్ల పెరుగుదలతో 11,465 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. బీపీసీఎల్‌ 5 శాతం గ్యాప్‌అప్‌తో ట్రేడింగ్‌ను ఆరంభించగా, జీ టెలి, గ్రాసిమ్‌, బజాజ్‌ ఫైనాన్స్, విప్రో, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు 1-2 శాతం మధ్య లాభపడగా, వేదాంత, ఐషర్‌ మోటార్స్‌,

Most from this category