STOCKS

News


క్షీణించిన రూపాయి

Tuesday 20th August 2019
Markets_main1566273454.png-27874

చైనా తన కరెన్సీ యువాన్‌ విలువను తగ్గించుకోవడంతో రూపీ డాలర్‌ మారకంలో మంగళవారం 8 పైసలు బలహీనపడి 71.51 వద్ద ప్రారంభమైంది. ఉదయం 9.23 సమయానికి 71.63 వద్ద  రూపీ డాలర్‌ మారకంలో ట్రేడవుతోంది.అం‍తర్జాతీయ ఆర్థిక మందగమన భయాలు, విదేశి నిధుల ఔట్‌ఫ్లో కొనసాగుతుండడంతో రూపీ డాలర్‌ మారకంలో గత సెషన్‌లో 29 పైసలు బలహీనపడి 71.43 వద్ద ముగిసింది. వీటితో పాటు పెరిగిన చమురు ధరలు, డాలర్‌ బలపడడం కూడా రూపీ పై ప్రభావం చూపాయి. అదేవిధంగా పదేళ్ల ప్రభుత్వ బాండ్‌ ఈల్డ్‌ సోమవారం 6.8 వద్ద స్థిరపడింది. డాలర్‌ ఇండెక్స్‌ మేజర్‌ కరెన్సీ బాస్కెట్‌తో పొల్చితే 0.07 శాతం పెరిగి 98.21కు చేరుకుంది.
 



You may be interested

మంగళవారం వార్తల్లో షేర్లు

Tuesday 20th August 2019

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ‍ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  వోడాఫోన్‌ ఐడియా:- కంపెనీ ఎండీ, సీఈవోగా రవీందర్‌ థక్కర్‌ నియమితులయ్యారు. ప్రస్తుత సీఈవ బాధ్యతలు నిర్వర్తిస్తున్న బలేష్‌ శర్మ తిరిగి వోడాఫోన్‌ గ్రూప్‌నకు సేవలు అందించనున్నారరు.  ఎంఆర్‌పీఎల్‌:- వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో దక్షిణ కన్నడ జిల్లాలోని ఫేజ్‌-III యూనిట్‌లో రీఫైనరీ యూనిట్‌ కార్యకలాపాలు నిలివేస్తున్నట్లు తెలిపింది. అయితే, ఫేజ్‌-I, ఫేజ్‌-II యూనిట్లు కార్యకలాపాలు యధావిధిగా జరుగుతాయని తెలిపింది. టాటా మోటర్స్‌ :- కంపెనీ

ప్రారంభంలో సూచీలు అక్కడక్కడే

Tuesday 20th August 2019

క్రితం రోజు గరిష్టస్థాయి వద్ద అమ్మకాల ఒత్తిడికి లోనైన భారత్‌ స్టాక్‌ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ క్రితం ముగింపుతో పోలిస్తే దాదాపు స్థిరంగా 37,400 పాయింట్ల సమీపంలోనూ, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,055 పాయింట్ల సమీపంలోనూ మొదలయ్యాయి. జీ టెలి, ఇన్ఫోసిస్‌, హీరో మోటో, డాక్టర్‌ రెడ్డీస్‌, గ్రాసిమ్‌ షేర్లు స్వల్పలాభాలతో మొదలుకాగా, బ్రిటానియా, కోల్‌ ఇండియా, యస్‌బ్యాంక్‌లు స్వల్పనష్టాలతో ఆరంభమయ్యాయి. 

Most from this category