News


బలహీనపడిన రూపీ

Monday 11th November 2019
Markets_main1573445000.png-29495

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో సోమవారం సెషన్లో 8 పైసలు బలహీనపడి 71.36 వద్ద ప్రారంభమైంది. కాగా గత సెషన్లో రూపీ డాలర్‌ మారకంలో 71.28 వద్ద ముగిసింది. ‘ఇండియాపై దృక్పథాన్ని ‘స్థిరం’ నుంచి ‘ప్రతికూలం’కు మూడిస్‌ తగ్గిం‍చింది. కానీ సమీపకాలం వరకు రూపీపై దీని ప్రభావం స్వల్పంగా ఉంటుంది’ అని ఆనంద్‌ రాఠి షేర్స్‌ అండ్‌ స్టాక్‌ బ్రోకింగ్‌, కరెన్సీ, కమోడిటీ రిసెర్చ్‌ ఎనలిస్ట్‌, రుషభ్‌ మారు అన్నారు. ‘యుఎస్‌-చైనా వాణిజ్య ఒప్పందంపై ఇన్వెస్టర్లు ఆశావాదంగా ఉండడంతో రూపీకి కొంత ఉపశమనం లభిస్తుంది’ అని తెలిపారు.  ‘దేశీయ, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. ఇది రూపీకి మద్ధతుగా ఉంటుంది. ప్రస్తుతం వచ్చే వారం వెలువడనున్న దేశీయ స్థూల ఆర్థిక డేటాపై ఇన్వెస్టర్లు దృష్ఠి సారించారు. సమీపకాలం వరకు రూపీ డాలర్‌ మారకంలో 70.80, 71.60 పరిధిలో ట్రేడవ్వవచ్చు’ అని ‍వివరించారు. ట్రేడ్‌వార్‌లో భాగంగా విధించుకున్న టారిఫ్‌లను యుఎస్‌, చైనా వెనక్కితీసుకుంటాయనే వార్తలు వెలువడుతుండడంతో డాలర్‌ మూడు వారాల గరిష్ఠానికి చేరుకుంది.



You may be interested

11840పాయింట్ల వద్ద బలమైన మద్దతు!

Monday 11th November 2019

ఏంజల్‌ బ్రోకింగ్‌ అనలిస్టు సమిత్‌ చవాన్‌ గతవారం నిఫ్టీ సుమారు 200 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. వారాంతానికి నెగిటివ్‌గా క్లోజయి వారం మొత్తం ఆర్జించిన లాభాలు దాదాపు వదిలిపెట్టింది. సెన్సెక్స్‌ కొత్త రికార్డులను చూస్తుండగా, నిఫ్టీ మాత్రం వెనకముందు ఆడుతోంది. గతవారం నిఫ్టీ గత గరిష్ఠం దాటేందుకు పలు యత్నాలు చేసింది. కానీ సఫలం కాలేదు. ఈ నేపథ్యంలో నిఫ్టీకి 11843 పాయింట్ల వద్ద చాలా బలమైన మద్దతు ఉంది. ఇంట్రాడేలో

గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌

Monday 11th November 2019

అమెరికా-చైనాల ట్రేడ్‌డీల్‌ పట్ల తిరిగి అనుమానాలు తలెత్తడంతో ఆసియా మార్కెట్లు ప్రతికూలంగా ట్రేడవుతున్న నేపథ్యంలో భారత్‌ స్టాక్‌ సూచీలు సైతం గ్యాప్‌డౌన్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 50 పాయింట్ల క్షీణతతో 40,270 పాయింట్ల సమీపంలో ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 20 పాయింట్ల తగ్గుదలతో 11,888 పాయింట్ల వద్ద మొదలయ్యింది. 

Most from this category