News


21 పైసలు బలహీనపడిన రూపీ

Tuesday 15th October 2019
Markets_main1571111772.png-28880

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో మంగళవారం ట్రేడింగ్‌లో 71.24 వద్ద ప్లాట్‌గా ప్రారంభమైంది. కాగా యుస్‌-చైనా మధ్య కుదిరిన పాక్షిక ఒప్పందం అమలుపై అనుమానాలు రేకత్తడంతో సోమవారం సెషన్‌లో ఇన్వెస్టర్లు రక్షణాత్మక ధోరణిని అనుసరించారు. ఫలితంగా గత సెషన్లో రూపీ డాలర్‌ మారకంలో 21 పైసలు బలహీనపడి 71.23 వద్ద ముగిసింది. గత సెషన్‌లో ఎన్‌ఎస్‌ఈలో డాలర్‌-రూపీ అక్టోబర్‌ కాంట్రాక్ట్‌ 71.29 వద్ద ఉందని, ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ 1.02 శాతం పెరిగిందని ఐసీఐసీఐ డైరక్ట్‌ పేర్కొంది. డాలర్‌-రూపీకి దిగువ స్థాయిల వద్ద మధ్దతు లభించే అవకాశం ఉందని, దీనిని లాంగ్‌ పొజిషన్‌లు తీసుకోడానికి వినియోగించుకోవాలని ఈ బ్రోకరేజి సలహాయిచ్చింది.



You may be interested

మూడేళ్ల కనిష్టానికి టోకు ధరలు

Tuesday 15th October 2019

సెప్టెంబర్‌లో 0.33 శాతం ‘తయారీ’లో ధరల క్షీణత ఇంధనం, విద్యుత్‌లోనూ ఇదే ధోరణి ఆర్థిక మందగమనానికి సంకేతం న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం  తాజా గణాంకాలు ఆర్థిక వ్యవస్థలో మందగమనాన్ని సూచిస్తున్నాయి.  సెప్టెంబర్‌లో సూచీ 0.33 శాతంగా నమోదయ్యింది. మూడు సంవత్సరాల తర్వాత టోకు సూచీని ఈ స్థాయిలో చూడ్డం ఇదే తొలిసారి. 2016 జూన్‌లో టోకు ద్రవ్యోల్బణంలో అసలు పెరుగుదలలేకపోగా -0.1 శాతం క్షీణించింది. 2019 ఆగస్టులో టోకు ద్రవ్యోల్బణం

పాజిటివ్‌ ప్రారంభం

Tuesday 15th October 2019

క్రితం రోజు నష్టాల్ని చవిచూసిన భారత్‌ స్టాక్‌ సూచీలు మంగళవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 102 పాయింట్ల లాభంతో 38,316 పాయింట్ల వద్ద మొదలుకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 20 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 11,360 పాయింట్ల వద్ద ఆరంభమయ్యింది. యస్‌బ్యాంక్‌, ఐఓసీ, ఓఎన్‌జీసీ, బీపీసీఎల్‌, టీసీఎస్‌లు 1-2 శాతం మధ్య ట్రేడింగ్‌ ప్రారంభంలో పెరిగాయి. ఇన్ఫోసిస్‌, ఇన్‌ఫ్రాటెల్‌, జీ టెలి, హిందాల్కో, వేదాంత, టాటా మోటార్స్‌ షేర్లు 1-2.5 శాతం

Most from this category