News


71.22 వద్ద రూపీ ప్రారంభం

Thursday 3rd October 2019
Markets_main1570075044.png-28685

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో గురువారం ట్రేడింగ్‌లో 14 పైసలు బలహీనపడి 71.22 వద్ద ప్రారంభమైంది. గాంధీ జయంతి కారణంగా బుధవారం కరెన్సీ మార్కెట్‌ ప్రారంభంకాలేదు. కాగా దేశీయ ఈక్విటీ మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో మంగళవారం సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 20 పైసలు పడిపోయి 71.08 ముగిసింది. 
  యుఎస్‌-చైనా మధ్య చర్చలు అక్టోబర్‌ 10న జరగనుండడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉన్నారని ఫారెక్స్‌ ట్రేడర్లు తెలిపారు. అంతేకాకుండా బుధవారం అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్‌ ధరలు పెరగడం కూడా రూపీ డాలర్‌ మారకంలో బలహీనపడడానికి కారణంగా ఉంది. గత సెషన్‌లో రూపీ-డాలర్‌ ఎన్‌ఎస్‌ఈ అక్టోబర్‌ కాంట్రాక్ట్‌ 71.30 వద్ద ఉందని, ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ 1.52 శాతం తగ్గిం‍దని ఐసీఐసీఐ డైరక్ట్‌ తెలిపింది. ‘డాలర్‌-రూపీ జంటకు దిగువ స్థాయిల వద్ద మద్ధతు లభిస్తుందని అంచనావేస్తున్నాం. దీనిని లాంగ్‌పొజిషన్‌లను తీసుకోడానికి వినియోగించుకోవాలి’ అని ఈ బ్రోకరేజి సలహాయిచ్చింది.



You may be interested

యస్ బ్యాంకుపై పూర్తి నమ్మకం ఉంది

Thursday 3rd October 2019

ప్రమోటరు అశోక్ కపూర్ కుటుంబం స్పష్టీకరణ ముంబై: మొండిబాకీలు, ఇతర వివాదాలతో షేరు జీవితకాల కనిష్ట స్థాయికి పడిపోయినప్పటికీ యస్‌ ‍బ్యాంకును గట్టెక్కించే అంశంలో మేనేజ్‌మెంట్‌పై తమకు పూర్తి నమ్మకం ఉందని సహ ప్రమోటరు అశోక్ కపూర్ కుటుంబం స్పష్టం చేసింది. "యస్‌ బ్యాంకుకు మా పూర్తి మద్దతు ఉంది. బ్యాంకు మేనేజ్‌మెంటుపై పూర్తి నమ్మకం ఉంది" అని అశోక్ కపూర్ కుమార్తె షగున్ గోగియా తెలిపారు. మరో ప్రమోటరు రాణా

గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌

Thursday 3rd October 2019

‍ప్రపంచ మార్కెట్ల ప్రతికూల సంకేతాల నేపథ్యంలో భారత్‌ స్టాక్‌ సూచీలు గురువారం గ్యాప్‌డౌన్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 250 పాయింట్ల క్షీణతతో 38,050 పాయింట్ల సమీపంలోనూ, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 75 పాయింట్ల నష్టంతో 11,285 పాయింట్ల సమీపంలోనూ మొదలయ్యాయి. 

Most from this category