News


71.20 వద్ద ప్రారంభమైన రూపీ

Friday 20th September 2019
Markets_main1568952078.png-28443

దేశీయ కరెన్సీ రూపీ డాలర్‌ మారకంలో 12 పైసలు బలపడి 71.20 వద్ద శుక్రవారం ప్రారంభమైంది. దేశీయ ఈక్విటీ మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో పాటు, విదేశి నిధుల ఔట్‌ఫ్లో కొనసాగడం, చమురు ధరలు పెరగడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో బలహీనపడి 71.32 వద్ద ముగిసింది. గత సెషన్‌లో డాలర్‌-రూపీ సెప్టెంబర్‌ కాంట్రాక్ట్‌ ఎన్‌ఎస్‌ఈలో 71.38 వద్ద ఉండగా, ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ 7.12 శాతం తగ్గిందని ఐసీఐసీఐ డైరక్ట్‌ పేర్కొంది. డాలర్‌-రూపీ జంటకు దిగువ స్థాయిల వద్ద మద్ధతు లభించే అవకాశం ఉందని, దీనిని లాంగ్‌ పొజిషన్‌లను తీసుకోడానికి ఉపయోగించుకోవాలని ఈ బ్రోకరేజి తెలిపింది.



You may be interested

యస్‌ బ్యాంక్‌లో 2 శాతం వాటా విక్రయించిన మోర్గాన్‌ క్రెడిట్స్‌

Friday 20th September 2019

ఆర్‌నామ్‌ ఎన్‌సీడీల చెల్లింపుల కోసం న్యూఢిల్లీ: యస్‌ బ్యాంక్‌లో ప్రమోటర్‌ సంస్థ, మోర్గాన్‌ క్రెడిట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఎమ్‌సీపీఎల్‌) 2.3 శాతం వాటాకు సమానమైన ఈక్విటీ షేర్లను విక్రయించింది. రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ ఎన్‌సీడీలకు ముందుగానే చెల్లింపులు జరపడానికి, మరోవైపు ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం యస్‌బ్యాంక్‌లో ప్రమోటర్ల వాటా తగ్గించుకునే ​క్రమంలో భాగంగా మోర్గాన్‌ క్రెడిట్స్‌ ఈ షేర్లను విక్రయించింది. యస్‌ బ్యాంక్‌ మాజీ సీఈఓ రాణా కపూర్‌కు

లాభంతో ప్రారంభమైన మార్కెట్‌..!

Friday 20th September 2019

కిత్రం రోజు భారీ నష్టంతో ముగిసిన దేశీయ మార్కెట్‌ శుక్రవారం లాభంతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 152 పాయింట్లు పోలిస్తే 36,215 వద్ద, నిఫ్టీ 42 పాయింట్ల లాభంతో 10,746.80 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌, మీడియా, మెటల్‌, ఫార్మా, రియల్టీ రంగ షేర్ల పతనంలో సూచీల లాభాలు హరించుకుపోయాయి. ఉదయం గం.9:25ని.లకు సెన్సెక్స్‌ 70 పాయింట్లు పెరిగి 36,163.53 వద్ద నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో 10,715 వద్ద

Most from this category