News


స్వల్ప నష్టంతో రూపీ ప్రారంభం

Wednesday 23rd October 2019
Markets_main1571805592.png-29074

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో బుధవారం సెషన్లో 6 పైసలు బలహీనపడి 71 వద్ద ప్రారంభమైంది. కాగా యుఎస్‌-చైనా పాక్షిక ఒప్పందం ఖరారవుతుందనే అంచనాలుండడంతో పాటు, చమురు ధరలు పడిపోతుండడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో రెండు వారాల గరిష్టమయిన 70.94 వద్ద ముగిసింది. గత సెషన్లో అక్టోబర్‌ ఎన్‌ఎస్‌ఈ డాలర్‌-రూపీ కాంట్రాక్ట్‌ 71.0 వద్ద ఉందని, ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ 0.43 శాతం పెరిగిందని ఐసీఐసీఐ డెరక్ట్‌ పేర్కొంది. డాలర్‌-రూపీకి దిగువ స్థాయిల వద్ద మద్ధతు లభించే అవకాశం ఉందని, దీనిని లాంగ్‌ పొజిషన్‌లు తీసుకోడానికి వినియోగించుకోవాలని ఈ బ్రోకరేజీ సలహాయిచ్చింది.



You may be interested

‘‘యూఎస్‌ సెక్‌’’ చేతిలో ఇన్ఫీ సాక్ష్యాలు!

Wednesday 23rd October 2019

కంపెనీ విచారణ వల్ల ప్రయోజనం లేదంటున్న నిపుణులు అమెరికా నియంత్రణ సంస్థ నిర్ణయమే కీలకం ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో టాప్‌ మేనేజ్‌మెంట్‌ అనైతికంగా వ్యవహరిస్తోందంటూ విజిల్‌బ్లోయర్లు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై విచారణకు అమర్‌చంద్‌ మంగళ్‌దాస్‌ లాసంస్థను నియమిస్తున్నట్లు ఇన్ఫోసిస్‌ వెల్లడించింది. కానీ ఈ విషయమై పూర్తి సాక్ష్యాలు యూఎస్‌ సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్చేంజ్‌ కమీషన్‌(యూఎస్‌ సెక్‌) చేతిలో ఉన్నందున కంపెనీ విచారణ ఎంతవరకు సాగుతుందోనని నిపుణులు అనుమానం వ్యక్తం

బ్యాంకింగ్‌ ఆందోళనకరం: అభిజిత్‌ బెనర్జీ

Wednesday 23rd October 2019

భారత్‌ బ్యాంకింగ్‌ సంక్షోభ పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని నోబెల్‌ బహుమతి గ్రహీత అభిజిత్‌ బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితిని ఎదుర్కొనడానికి తగిన పటిష్ట చర్యలు అవసరమని ఆయన న్యూఢిల్లీలో విలేకరులతో అన్నారు. బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాను 50 శాతం దిగువకు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దీనివల్ల అధికారులు కొంత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోగలుగుతారని విశ్లేషించారు.  ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో సంక్షోభం వస్తే కష్టమే! నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ) రంగంలో

Most from this category