News


నష్టాల్లో ప్రారంభమైన రూపీ!

Monday 7th October 2019
Markets_main1570420568.png-28746

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో సోమవారం 8 పైసలు బలహీనపడి 70.96 వద్ద ప్రారంభమైంది. కాగా ఆర్‌బీఐ ఎంపీసీ(మానెటరీ పాలసీ కమిటీ) ఈ ఏడాది వరుసగా తన ఐదవ సమావేశంలో 25 బేసిసి పాయింట్ల వరకు రెపో రేటును తగ్గించడంతో, గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 70.88 వద్ద ప్లాట్‌గా ముగిసింది. మొత్తంగా గత వారంలో రూపీ డాలర్‌ మారకంలో 32 పైసలు బలహీనపడింది. 
 గత సెషన్‌లో ఎన్‌ఎస్‌ఈలో డాలర్‌-రూపీ అక్టోబర్‌ కాంట్రాక్ట్‌ 71.08 వద్ద ఉందని, ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ 0.62 శాతం పెరిగిందని ఐసీఐసీఐ డైరక్ట్‌ తెలిపింది. డాలర్‌-రూపీకి దిగువ స్థాయిల వద్ద మద్ధతు లభించే అవకాశం ఉందని, దీనిని లాంగ్‌పొజిషన్‌లు తీసుకోడానికి వినియోగించుకోవాలని ఈ బ్రోకరేజి సలహాయిచ్చింది.



You may be interested

అన్ని కాలాల్లోనూ పెట్టుబడులకు అనుకూలం..!

Monday 7th October 2019

ఈక్విటీ మార్కెట్లలో సాధారణంగా అస్థిరతలు ఉంటుంటాయి. కానీ, కొన్ని సందర్భాల్లో ఇవి అసాధారణ స్థాయికి చేరుతుంటాయి. ముఖ్యంగా ఈ తరహా ఆటుపోట్లు, అనిశ్చిత పరిస్థితుల్లో మల్టీక్యాప్‌ విభాగం ఈక్విటీ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తుంటుంది. ఎందుకంటే ఈ విభాగంలోని మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలు కేవలం ఒక విభాగానికే పరిమితం కాకుండా.. చిన్న, మధ్య, పెద్ద స్థాయి ఇలా అన్ని రకాల మార్కెట్‌ విలువతో కూడిన స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే వెసులుబాటుతో ఉంటాయి. మార్కెట్‌

ఈ నెల 14 నుంచి బడ్జెట్‌ కసరత్తు

Monday 7th October 2019

నవంబర్‌ మొదటి వారం వరకూ సమావేశాలు  కొత్తగా ఎస్‌సీ, ట్రైబల్‌ సబ్‌ప్లాన్‌లు ! న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ కసరత్తు ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్నది. నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తర్వాత రానున్న రెండో బడ్జెట్‌ ఇది. మరోవైపు ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టబోయే రెండో బడ్జెట్‌  కూడా ఇదే. బడ్జెట్‌ ముందస్తు/సవరించిన అంచనాల సమావేశాలు ఈ నెల 14 నుంచి

Most from this category