News


70.95 వద్ద రూపీ ప్రారంభం

Friday 27th September 2019
Markets_main1569556603.png-28573

దేశీయ కరెన్సీ రూపీ,  డాలర్‌ మారకంలో శుక్రవారం 7 పైసలు బలహీనపడి 70.95 వద్ద ప్రారంభమైంది. కాగా చైనాతో వాణిజ్య ఒప్పందం అనుకున్న సమయం కంటే ముందే ఏర్పడే వీలుందని యుఎస్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ బలపడింది. ఫలితంగా గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 16 పైసలు బలపడి 70.88 వద్ద ముగిసింది. దీంతోపాటు గత సెషన్‌లో దేశీయ ఈక్విటీ మార్కెట్‌లు  పాజిటివ్‌గా ట్రేడవ్వడం, విదేశీ నిధుల ఇన్‌ఫ్లో జరగడంతో పాటు చమురు ధరలు పడిపోవడంతో రూపీ డాలర్‌ మారకంలో బలపడింది.



You may be interested

సాఫ్ట్‌వేర్‌ కంపెనీ రూపంలో విదేశాలకు నల్లధనం తరలింపు

Friday 27th September 2019

అంధేరీలోని ఓ కంపెనీ నిర్వాకం న్యూఢిల్లీ: స్విస్‌బ్యాంకుల్లో భారతీయుల నల్లధనాన్ని వెలుగులోకి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాల నేపథ్యంలో... ముంబైలోని అంధేరీలో ఉన్న ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. మోటెక్‌ సాఫ్ట్‌వేర్‌ ప్రైవేటు లిమిటెడ్‌ అనే కంపెనీ అంధేరీ ప్రాంతం నుంచి గత 20 ఏళ్లుగా నడుస్తూ... మిలియన్ల డాలర్లను స్విట్జర్లాండ్‌లోని బ్యాంకుల్లో తనకున్న విదేశీ సంస్థల ద్వారా డిపాజిట్‌ చేసినట్టు తెలిసింది. ఈ కంపెనీకి వ్యతిరేకంగా దర్యాప్తు

స్మాల్‌క్యాప్‌ రికవరీ.. ఇక్కడ చూడండి..!

Friday 27th September 2019

మార్కెట్లో స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ రికవరీ బాట పట్టాయని ప్రముఖ ఇన్వెస్టర్‌ అనిల్‌కుమార్‌ గోయల్‌ పోర్ట్‌ఫోలియోను పరిశీలిస్తే అర్థమైపోతుంది. ఎందుకంటే గత 16 సెషన్లకుగాను 13 సెషన్లలో స్మాల్‌క్యాప్‌ సూచీ లాభపడింది. దీంతో ఈ నెలలో ఇప్పటికే 8 శాతానికి పైగా పెరిగింది. ఇదే కాలంలో సెన్సెక్స్‌ 4.4 శాతమే పెరగ్గా, అనిల్‌కుమార్‌ గోయల్‌ పోర్ట్‌ఫోలియోలోని స్టాక్స్‌ గత నెల రోజుల్లోనే 52 శాతం ర్యాలీ చేసినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.    అనిల్‌కుమార్‌

Most from this category