STOCKS

News


పెరిగిన రూపాయి

Tuesday 29th October 2019
Markets_main1572321120.png-29193

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో మంగళవారం సెషన్‌లో 14 పైసలు బలపడి 70.74 వద్ద ప్రారంభమైంది. కాగా చమురు ధరలు తగ్గడంతో పాటు, దేశీయ ఈక్విటీ మార్కెట్లు లాభపడడంతో అక్టోబర్‌ 25(శుక్రవారం) సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 14 పైసలు బలపడి 70.88 వద్ద ముగిసింది. దీపావళి బలిప్రతిపాద సందర్భంగా అక్టోబర్‌ 28న ఫారెక్స్‌ మార్కెట్లు పనిచేయలేదు. అంతర్జాతీయంగా చమురు డిమాండ్‌ ఆందోళనలు వెంటాడుతుండడంతో చమురు ధరలు మంగళవారం సెషన్‌లో కూడా నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఈ వారం రానున్న యుఎస్‌ చమురు నిల్వల డేటా, చమురు మార్కెట్‌ను ప్రభావితం చేయనుందని విశ్లేషకులు తెలిపారు. గత సెషన్‌లో ఎన్‌ఎస్‌ఈలో డాలర్‌-రూపీ నవంబర్‌ కాంట్రాక్ట్‌ 71.08 వద్ద ఉందని, ఓపెన్‌ ఇంట్రస్ట్‌ 21.97 శాతం పెరిగిందని ఐసీఐసీఐ డైరక్ట్‌ తెలిపింది. డాలర్‌-రూపీ జంటకు అధిక స్థాయిల వద్ద సరఫరా ఒత్తిడి ఏదురయ్యే అవకాశం ఉందని, దీనిని షార్ట్‌ పొజిషన్లు తీసుకోడానికి వినియోగించుకోవాలని ఈ బ్రోకరేజి సలహాయిచ్చింది.



You may be interested

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 29th October 2019

వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితమయ్యే షేర్లు వివరాలు టెలికాం కంపెనీలు:- టెలికాం కంపెనీలకు మరింత ఎదురుదెబ్బ తగిలింది. టెల్కోల రాబడి నిర్వచనం, కేంద్రానికి లైసెన్సు ఫీజులపై చెల్లించాల్సిన జరిమానాను 4నెలల్లోగా చెల్లించాలని ఆర్డర్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నేడు భారతీ ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా కంపెనీ షేర్లు ఎక్కువ వాల్యూమ్స్‌తో ట్రేడయ్యే అవకాశం ఉంది. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌:- యూఎస్‌ఎఫ్‌డీఏ ఏపీలో శ్రీకాకుళం ఏపీఐ ప్లాంట్‌ తనిఖీలను పూర్తి చేసింది.

లాభాల ప్రారంభం

Tuesday 29th October 2019

ఆదివారంనాటి మూరత్‌ ట్రేడింగ్‌లో 2076 హిందూ నామ సంవత్సరాన్ని శుభారంభం చేసిన స్టాక్‌ సూచీలు ఒక రోజు సెలవు అనంతరం మంగళవారం తిరిగి లాభాల్లో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 49 పాయింట్ల పెరుగుదలతో 39,300 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 17 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 11,644 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. అమెరికా-చైనాల వాణిజ్య ఒప్పందం ఒక కొలిక్కివస్తున్నదంటూ ఇరుదేశాల అధికారులూ చేసిన ‍ప్రకటనలు, యూరోపియన్‌ యూనియన్‌ బ్రెగ్జిట్‌ గడువును జనవరి 31

Most from this category