70.73 వద్ద రూపీ ప్రారంభం
By Sakshi

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్ మారకంలో మంగళవారం ట్రేడింగ్‌లో 14 పైసలు బలపడి 70.73 వద్ద ప్రారంభమైంది. కాగా గత సెషన్లో చమురు ధరలు తగ్గినప్పటికి, ప్రధాన కరెన్సీలతో పోల్చుకుంటే డాలర్ బలపడడంతో రూపీ డాలర్ మారకంలో 31 పైసలు బలహీనపడి 70.87 వద్ద ముగిసింది. యూఎస్-చైనా ట్రేడ్‌వార్ ఆందోళనల వలన ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోడానికి ఇష్టపడడం లేదని విశ్లేషకులు తెలిపారు. దీంతోపాటు గత సెషన్లో దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ నిధుల ఔట్‌ఫ్లో కొనసాగడంతో రూపీ డాలర్ మారకంలో బలహీనపడిందని అన్నారు.
గత సెషన్లో రూపీ-డాలర్ ఎన్ఎస్ఈ అక్టోబర్ కాంట్రాక్ట్ 71.07 వద్ద ఉందని, ఓపెన్ ఇంట్రెస్ట్ 0.32 శాతం పెరిగిందని ఐసీఐసీఐ డైరక్ట్ పేర్కొంది. డాలర్-రూపీకి దిగువ స్థాయిల వద్ద మద్ధతు లభించే అవకాశం ఉందని, దీనిని లాంగ్ పొజిషన్లు తీసుకోడానికి వినియోగించుకోవాలని ఈ బ్రోకరేజి సలహాయిచ్చింది.
You may be interested
గరిష్టస్థాయి నుంచి బ్యాంక్ నిఫ్టీ 400 పాయింట్లు డౌన్
Tuesday 1st October 2019బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఆరంభలాభాల్ని కోల్పోయింది. నేడు ఇండెక్స్ 123 పాయింట్ల లాభంతో 29,226.15 వద్ద మొదలైంది. మార్కెట్ ప్రారంభంలో బ్యాంకింగ్ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇండెక్స్ ఒకదశలో 1.50శాతం(423 పాయింట్లు) పెరిగి 29526.40 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. అనంతరం అనూహ్యంగా బ్యాంకింగ్ రంగ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఇండెక్స్ గరిష్టస్థాయి(29526.40) నుంచి పతనమైంది. ఉదయం గం.9:45ని.లకు ఇండెక్స్ లాభాలు హరించుకుపోయి అరశాతం
11500 పైన ప్రారంభమైన నిఫ్టీ
Tuesday 1st October 2019జాతీయ, అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పటికీ.., మార్కెట్ మంగవారం లాభంతో ప్రారంభమైంది. రెండు రోజుల నష్టాల ముగింపునకు స్వస్తి సెన్సెక్స్ 150 పాయింట్లు లాభంతో 38,910 వద్ద మొదలైంది. నిఫ్టీ 41 పాయింట్లు 11500పైన 11515 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఎన్ఎస్ఈలోని కీలకమైన బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 123 పాయింట్లు పెరుగుదలతో 29,226.15 వద్ద మొదలైంది. బ్యాంకింగ్, అటో, ఆర్థిక, ఎఫ్ఎంసీజీ మీడియా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. ఐటీ,