News


70.42 వద్ద రూపీ ప్రారంభం

Monday 30th September 2019
Markets_main1569816390.png-28616

దేశీయ రూపీ, డాలర్‌ మారకం‍లో 14 పైసలు బలపడి 70.42 వద్ద సోమవారం ట్రేడింగ్‌లో ప్రారం‍భమైంది. కాగా యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారులపై  పాక్షిక కాల్పుల విరమణ ఒప్పందానికి సౌదీ అరేబియా అంగీకరించిందనే నివేదిక విడుదలవ్వడంతో గత సెషన్‌లో చమురు ధరలు పడిపోయాయి. దీంతో శుక్రవారం సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 32 పైసలు బలపడి 70.56 వద్ద ముగిసింది. ఇది అగష్టు 2 తర్వాత గరిష్ఠ స్థాయి కావడం గమనార్హం. అంతేకాకుండా సౌదీ చమురు ఉత్పత్తి తిరిగి సాధరణ స్థాయికి రావడంతో కూడా చమురు ధరలు పడిపోతున్నాయి., 



You may be interested

ఈ వారం స్టాక్‌ రికమెండేషన్స్‌

Monday 30th September 2019

ఏషియన్‌ పెయింట్స్‌     కొనచ్చు  బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌ ప్రస్తుత ధర: రూ.1,776 టార్గెట్‌ ధర: రూ.1,950 ఎందుకంటే:- కార్పొరేట్‌ ట్యాక్స్‌ను  33 శాతం నుంచి 25.2 శాతానికి కేంద్రం తగ్గించడం ఈ కంపెనీకి బాగా ప్రయోజనం చేకూర్చే అంశమే. ఈ పన్ను కోత కారణంగా ఈ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరంలోనూ, వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ చెరో 12 శాతం చొప్పున పెరగనున్నది. డెకరేటివ్‌ పెయిం‍ట్స్‌ సెగ్మెంట్లో ముఖ్యంగా ప్రీమియమ్‌

పెట్టుబడులపై రాబడితోపాటు బీమా

Monday 30th September 2019

  యూటీఐ యులిప్‌ పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్‌ ఎవరైనా కానీ ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తట్టుకుని, దీర్ఘకాలంలో అధిక రాబడులు సమకూర్చుకోవాలన్న లక్ష్యంతోనే ఉంటారు. అయితే, ఇటీవలి కాలంలో ఈక్విటీ మార్కెట్లు ఎంతో అస్థిరతంగా మారాయి. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల రక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. రిస్క్‌ తీసుకోలేని ఇన్వెస్టర్లు ఈ తరహా ఆటుపోట్ల నుంచి రక్షణకు బ్యాలన్స్‌డ్‌ లేదా హైబ్రిడ్‌ డెట్‌ ఫండ్స్‌ను పెట్టుబడుల కోసం పరిశీలించొచ్చు. ఇవి స్థిరమైన రాబడులను ఇస్తాయి.

Most from this category