News


68.75 వద్ద రూపీ ప్రారంభం

Thursday 18th July 2019
Markets_main1563424472.png-27138

రూపీ డాలర్‌ మారకంలో 0.04 శాతం బలహీనపడి 68.76 వద్ద గురువారం ట్రేడవుతోంది. విదేశి పెట్టుబడులు ఔట్‌ఫ్లో ఉండడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 11 పైసలు కోల్పోయి 68.82 వద్ద ముగిసింది. దీంతో పాటు దేశియ మార్కెట్లలో మదుపర్లు జాగ్రత్త వహించడంతో రూపీ బలహీన పడింది. మేజర్‌ కరెన్సీలతో పోల్చుకుంటే డాలర్‌ బలహీన పడడంతో రూపీ కొంత వరకు కొలుకోగలిగింది. గత సెషన్‌లో ఇంటర్‌ బ్యాంక్‌ ఫారిన్‌ ఎక్సెంజ్‌(ఫారెక్స్‌) మార్కెట్లో రూపీ, డాలర్‌ మారకం‍లో 68.69 వద్ద ప్రారంభమైంది. కాగా రూపీ మధ్ధతును కోల్పోయి 11 పైసలు బలహీనపడి 68.82 వద్ద ముగిసింది. ‘అమెరికా వృద్ధి రేటు అంచనాల కంటే మెరుగ్గా ఉండడంతో మేజర్‌ కరెన్సీలు డాలర్‌ మారకంలో బలహీనపడ్డాయి. దీంతో పాటు ఎఫ్‌ఐఐల ఔట్‌ఫ్లో రూపీ బలహీన పడడానికి కారణమయ్యింది. ఈ నెలలో ఈక్విటీ మార్కెట్లలో  777 మిలియన్‌ల అమెరికా డాలర్ల అమ్మకం జరిగింది’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ పీసీజీ అండ్‌ క్యాపిటల్‌ మార్కెట్స్‌ హెడ్‌ వీకే శర్మ తెలిపారు. ఎక్సేంజ్‌ డేటా ప్రకారం రూ.16.97 కోట్లు విదేశి సంస్థాగత పెట్టుబడులు బుధవారం దేశియ మార్కెట్లను దాటి పోయాయి. అంతేకాకుండా చమురు ధరలు  పెరగడం కూడా రూపీ బలహీనతకు కారణమయ్యింది. ట్రేడ్‌వార్‌ వలన ఇండియా ఎగుమతులు జూన్‌ నెలలో 9 నెలల కనిష్ఠానికి పడిపోయాయి. దీంతోపాటు బాండ్‌ ఈల్డ్‌లు కూడా పడిపోవడంతో  ఆర్బిఐ తదుపరి రేట్ల కోతపై భయాలు పెరిగాయి.  రూపాయి/డాలర్‌ రిఫరెన్స్ రేటును 68.5672 గా, రూపాయి /యూరో 77.1838 గా , రూపాయి /బ్రిటిష్ పౌండ్ల 85.7657 గా, రూపాయి /100 జపనీస్ యెన్‌ 63.45. గా ఫైనాన్షియల్ బెంచ్మార్క్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎఫ్‌బిఐఎల్) నిర్ణయించింది. 
 



You may be interested

ఫలితాల సెగ...యస్‌ బ్యాంక్‌ 15 శాతం క్రాష్‌

Thursday 18th July 2019

15శాతం క్షీణించిన షేర్లు  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) మొదటి త్రైమాసికంలో భారీ నష్టాలను ప్రకటించిన ప్రైవేటు రంగానికి చెందిన యస్‌ బ్యాంక్‌ షేర్లు గురువారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 15శాతం పతనమయ్యాయి. యస్‌ బ్యాంక్‌ నిన్న మార్కెట్‌ ముగింపు అనంతరం తొలి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. తొలి క్వార్టర్‌లో మొండి బకాయిల బెడద కొనసాగడం, ఆస్తుల నాణ్యత క్షీణించడటం పాటు మొండిబకాయిలకు అధిక ప్రోవిజన్లు కేటాయింపులతో రూ.95.56 కోట్ల నికర

తగ్గిన చమురు

Thursday 18th July 2019

డిమాండ్‌ సీజన్‌లో కూడా చమురు డిమాండ్‌ బలహీనంగా ఉండడంతో పాటు, అమెరికా చమురు ఉత్పత్తి తిరిగి గాడిలో పడడంతో గురువారం ట్రేడింగ్‌లో చమురు ధరలు నష్టాల్లో ఉన్నాయి. వీటితో పాటు గత వారం గ్యాసోలిన్‌ ఉత్పత్తి పెరగడంతో  బ్రెంట్‌ క్రూడ్‌ 0.2 శాతం నష్టపోయి బ్యారెల్‌కు 63.51 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.5 శాతం తగ్గి  బ్యారెల్‌కు 56.52 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. గత సెషన్‌లో బ్రెంట్‌ క్రూడ్‌

Most from this category