News


71 దిగువకు రూపాయి విలువ

Thursday 7th November 2019
Markets_main1573100181.png-29410

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో గురువారం సెషన్‌లో 7 పైసలు నష్టపోయి 71.05 వద్ద ప్రారంభమైం‍ది. గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 29 పైసలు బలహీనపడి 70.98 వద్ద ముగిసింది. ఇతర ప్రధాన కరెన్సీలతో పాటు డాలర్‌ కూడా బలహీనపడడం, చమురు ధరలు పడిపోవడం వంటి కారణాల వలన రూపీ పతనం పరిమితమయ్యింది. 
    ‘ఫేజ్-1 వాణిజ్య ఒప్పందం కోసం యుఎస్‌-చైనా ఆత్రుతగా ఉన్నాయి. ఈ నెలలో ఈ ఒప్పందం ఖరారయ్యే అవకాశం ఉండడంతో డాలర్‌-రూపీ జంట క్షీణిస్తోంది(డాలర్‌ దృక్పథంలో). కానీ చైనా ఉత్పత్తులపై మరిన్ని టారీఫ్‌లను యుఎస్‌ తొలగించే విధంగా చైనా ప్రయత్నాలు చేస్తుండడంతో ఈ ఒప్పందం ఖరారుపై అనుమానాలు పెరిగాయి. ఫలితంగా డాలర్‌-రూపీ క్షీణత పరిమితమయ్యింది’ అని ఎమ్కే గ్లోబల్‌ ఫైనాన్సియల్‌, కరెన్సీ హెడ్, రాహుల్‌ గుప్తా అన్నారు. ‘ఇరు దేశాల మధ్య ఒప్పందం ఆలస్యమయితే డాలర్‌-రూపీ జంట తిరిగి పుంజుకుంటుంది. గత కొన్ని రోజుల నుంచి డాలర్‌-రూపీ స్పాట్‌ 70.50-71 పరిధిలో కదులుతోంది. ఒకవేళ ఈ జంట 71 స్థాయిని అధిగమిస్తే, 71.15 వరకు ర్యాలీ చూడొచ్చు’ అని అన్నారు.



You may be interested

కనిష్టస్థాయి నుంచి పసిడి రికవరీ

Thursday 7th November 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర కనిష్టస్థాయి నుంచి రికవరీని సాధించింది. అయినప్పటికి.., 1500 డాలర్ల దిగువున ట్రేడ్‌ అవుతోంది. రాత్రి అమెరికా మార్కెట్లో ఔన్స్‌ పసిడి ధర 9.50డాలర్లు మేర లాభపడి 1,493.10 వద్ద స్థిరపడింది. అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ క్షీణించడటం, డాలర్‌ ఇండెక్స్‌ బలహీనపడటం తదితర కారణాలు పసిడి బలపడేందుకు తోడ్పాటునిచ్చాయి. అమెరికా చైనాల మధ్య కుదరాల్సిన మొదటి దశ వాణిజ్య ఒప్పందం డిసెంబర్‌కు వాయిదా పడే అవకాశం ఉన్నట్లు

గత గరిష్ఠాన్ని దాటితే 12300కు నిఫ్టీ!

Thursday 7th November 2019

అనలిస్టుల అంచనాలు దేశీయ మార్కెట్లు బుధవారం అత్యంత వేగవంతమైన, బలమైన ఇంట్రాడే రికవరీ చూసాయి. దీంతో నిఫ్టీ మరోమారు 12వేల పాయింట్ల స్థాయిని తాకింది. చార్టుల్లో నిఫ్టీ బుల్లిష్‌ క్యాండిల్‌ ఏర్పరిచింది. కొద్ది రోజులుగా నిఫ్టీ 11700 పాయింట్ల పైనే క్లోజవడం బుల్లిష్‌ అంశం. నిఫ్టీలో బుల్స్‌ పట్టు కొనసాగుతుందని నిపుణుల అంచనా. ఈ జోరులో నిఫ్టీ మరోమారు గత గరిష్ఠం 12103 పాయింట్లను తాకవచ్చని భావిస్తున్నారు. ఆ స్థాయిల వద్ద

Most from this category