News


34 పైసలు నష్టపోయిన రూపీ

Friday 8th November 2019
Markets_main1573187378.png-29440

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో శుక్రవారం సెషన్లో 34 పైసలు నష్టపోయి 71.30 వద్ద ప్రారంభమైం‍ది. కాగా యుఎస్‌-చైనా మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారు కానుందనే అంచనాలు బలపడడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ బలపడింది. ఫలితంగా గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో, ప్రారంభ నష్టాలను పూడ్చుకొని 70.96 వద్ద ప్లాట్‌గా ముగిసింది. విదేశీ నిధుల ఇన్‌ఫ్లో స్థిరంగా కొనసాగడంతో కూడా రూపీ బలపడింది. కానీ చమురు ధరలు పెరగడంతో రూపీ లాభాలు పరిమితమయ్యాయి. డాలర్‌-రూపీ నవంబర్‌ కాంట్రాక్ట్‌ గత సెషన్‌లో ఎన్‌ఎస్‌ఈలో 71.04 వద్ద ఉందని, ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ 7.67 శాతం పెరిగిందని ఐసీఐసీఐ డైరక్ట్‌ తెలిపింది. డాలర్‌-రూపీ జంటకు దిగువ స్థాయిల వద్ద మద్ధతు లభించే అవకాశం ఉందని, దీనిని లాంగ్‌ పొజిషన్లు తీసుకోడానికి వినియోగించుకోవాలని ఈ బ్రోకరేజి సలహాయిచ్చింది. యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌లో భాగంగా ఇరు దేశాలు విధించుకున్న టారిఫ్‌లను దశల వారిగా వెనక్కి తీసుకునేందుకు యుఎస్‌, చైనా అంగీకరించాయనే వార్తలు గురువారం వెలువడ్డాయి. దీంతో ఇన్వెస్టర్లు సెంటిమెంట్‌ బలపడుతోంది. ఇన్వెస్టర్లు రిస్క్‌ ఉన్న ఆస్తులలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడుతున్నారని విశ్లేషకులు తెలిపారు. ట్రేడ్‌వార్‌  సరళతరమవ్వడంతో గత సెషన్లో బంగారం ధరలు ఒక నెల కనిష్ఠానికి పడిపోయాయి. 



You may be interested

కొత్త ఆల్‌టైం హైకి ఐసీఐసీఐ బ్యాంక్‌

Friday 8th November 2019

మార్కెట్‌ నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నప్పటికీ.., ఐసీఐసీఐ బ్యాంక్‌ షేరు శుక్రవారం కొత్త గరిష్టానికి చేరుకుంది. నేడు బీఎస్‌ఈలో ఈ షేరు రూ.480.00లు వద్ద మొదలైంది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచే  ఈ షేరు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో ఇంట్రాడేలో 2.55శాతం వరకు పెరిగి రూ.490.95 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఈ ధర షేరుకి జీవితకాల గరిష్టస్థాయి కావడం విశేషం. ఉదయం గం.9:50లకు షేరు క్రితం ముగింపు(రూ.478.70)తో పోలిస్తే 2.57 శాతం లాభంతో

నేడు క్యూ2 ఫలితాలను ప్రకటించే కంపెనీలు

Friday 8th November 2019

మహీంద్రా అండ్‌ మహీంద్రా, అశోక్‌ లేలాండ్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఐషర్‌ మోటార్స్‌, గెయిల్‌, అలహాబాద్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ, ఐడీబీఐ బ్యాంక్‌, ఐనాక్స్‌ విండ్‌, శోభ, టాటా కమ్యూనికేషన్స్‌, టాటా పవర్‌, భారత్‌ ఫోర్జ్‌, సెంచురీ ప్లేబోర్డ్స్‌, క్రిసిల్‌, డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌, కేఈసీ ఇంటర్నేషనల్‌, ఎమ్‌ఆర్‌ఎఫ్‌, రెలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కంపెనీలు తమ ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసిక ఫలితాలను విడుదలను చేయనున్నాయి.   

Most from this category