News


16 పైసలు బలహీనపడిన రూపీ

Wednesday 9th October 2019
Markets_main1570596040.png-28779

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో బుధవారం 16 పైసలు బలహీనపడి 71.18 వద్ద ప్రారంభమైంది. కాగా దేశీయ ఈక్విటీ మార్కెట్లో లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతోపాటు, విదేశీ నిధల ఔట్‌ఫ్లో కొనసాగడంతో అక్టోబర్‌ 7 సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 14 పైసలు క్షీణించి 71.02 వద్ద ముగిసింది. అక్టోబర్‌ 8న దసరా సందర్భంగా ఫారెక్స్‌ మార్కెట్‌కు సెలవు కావడంతో మార్కెట్‌లు ఓపెన్‌ కాలేదు. 
  ఆర్‌బీఐ రేట్‌ కట్‌ ప్రభావం తక్కువగా ఉండడంతో రూపీ డాలర్‌ మారకంలో 70.50-71.20 విస్తృత పరిధిలో కన్సాలిడేట్‌ అవుతుందని ఫారెక్స్‌ అండ్‌ బులియన్‌ విశ్లేషకులు మోతిలాల్‌ ఓస్వాల్‌ బ్రోకరేజి, గౌరాంగ్‌ సోమయా అన్నారు. దేశీయంగా పారిశ్రామిక ఉత్పత్తి తగ్గడంతో పాటు, అంచనాల కంటే దేశ ఆర్థిక వృద్ధి మందగించడంతో రూపీ డాలర్‌ మారకంలో ఒత్తిడి గురయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు. అంతర్జాతీయంగా ఫెడ్‌ మినిట్స్‌, యుఎస్‌ ద్రవ్యోల్బణ సంఖ్య రూపీపై ప్రభావం చూపనున్నాయని తెలిపారు. గత సెషన్‌లో డాలర్‌-రూపీ ఎన్‌ఎస్‌ఈ అక్టోబర్‌ కాంట్రాక్ట్‌ 71.18 వద్ద ఉందని, ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ 0.93 శాతం తగ్గిందని ఐసీఐసీఐ డైరక్ట్‌ పేర్కొంది. డాలర్‌-రూపీ జంటకు దిగువ స్థాయిల వద్ద మద్ధతు లభించే అవకాశం ఉందని, దీనిని లాంగ్‌పొజిషన్‌లు తీసుకోడానికి వినియోగించుకోవాలని ఈ బ్రోకరేజి సలహాయిచ్చింది.



You may be interested

యస్‌ బ్యాంక్‌ 8 శాతం డౌన్‌

Wednesday 9th October 2019

గత కొంత కాలంగా నిధుల సమీకరణలో ఇబ్బందులు పడుతున్న యెస్‌ బ్యాంక్‌, ప్రమోటర్‌ రాణా కపూర్‌ తన వాటాను విక్రయించుకోవడంతో మరింత ఇబ్బందుల్లో కూరుకుపోయింది. బ్యాంక్‌కు అవసరమైన నిధులను సరైనా ధర వద్దనే సమీకరిస్తామని బ్యాంక్‌ సీఈఓ రవనీత్‌ గిల్‌ ప్రకటించారు. కానీ దీంతో నిధుల సమీకరణ ఆలస్యం కానుందనే అంచనాలు మార్కెట్‌ వర్గాలలో వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా గత కొన్ని సెషన్ల నుంచి ఈ బ్యాంక్‌ షేరు నష్టాల్లో ట్రేడవుతోంది.

టీసీఎస్‌ ఫలితాలు.. బ్రోకరేజ్‌ల అంచనాలు...

Wednesday 9th October 2019

గురువారం దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్‌ సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలను ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో వివిధ బ్రోకరేజ్‌లు ఫలితాలపై ఎలాంటి అంచనాలతో ఉన్నాయో చూద్దాం.. నిర్మల్‌ బాంగ్‌ సెక్యూరిటీస్‌: యూఎస్‌ డాలర్‌ లెక్కల్లో వృద్ది 2.12 శాతం ఉంటుంది. రూపీ లెక్కల్లో నికర విక్రయాలు గతేడాదితో పోలిస్తే 6.9 శాతం మెరుగుదల చూపుతాయి. ఎబిటా గతేడాది క్యు2 కన్నా తక్కువగా 9,678 కోట్ల రూపాయలకు పరిమితం కావచ్చు. ఎబిటా మార్జిన్‌సైతం 24.6

Most from this category