News


14 పైసలు బలపడిన రూపీ

Monday 14th October 2019
Markets_main1571026245.png-28863

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో సోమవారం 14 పైసలు బలపడి 70.88 వద్ద ప్రారంభమైంది. కాగా ఇరాన్‌ ఆయిల్‌ ట్యాంకర్‌పై దాడి జరగడంతో శుక్రవారం సెషన్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరిగాయి. ఫలితంగా గత సెషన్లో రూపీ డాలర్‌ మారకంలో ప్రారంభ లాభాలను కోల్పోయి చివరికి 5 పైసలు బలపడి 71.02 వద్ద ప్లాట్‌గా ముగిసింది. గత సెషన్‌లో ఎన్‌ఎస్‌ఈలో రూపీ-డాలర్‌ అక్టోబర్‌ కాంట్రాక్ట్‌ 71.15 వద్ద ఉందని, ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ 1.60 శాతం తగ్గిందని ఐసీఐసీఐ డైరక్ట్‌ పేర్కొంది. డాలర్‌-రూపీ జంట అధిక స్థాయిల వద్ద సరఫరా ఒత్తిళ్లను ఎదుర్కొనే అవకాశం ఉందని, దీనిని షార్ట్‌ పొజిషన్‌లు తీసుకోడానికి వినియోగించుకోవాలని ఈ బ్రోకరేజి సలహాయిచ్చింది.



You may be interested

11100- 11600 రేంజ్‌లో నిఫ్టీ!

Monday 14th October 2019

నిపుణుల అంచనా నిఫ్టీ డెరివేటివ్స్‌ డేటా పరిశీలిస్తే 11100, 11200 పాయింట్ల వద్ద పుట్స్‌ ఎక్కువగా ఉండగా, 11400, 11500పాయింట్ల వద్ద కాల్స్‌ అధికంగా ఉన్నాయి. అందువల్ల ఈ సీరిస్‌కు 111000, 11600 పాయింట్లు మద్దతు, నిరోధాలుగా పనిచేస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇటీవలి పతనంసమయంలో నిఫ్టీ గత కన్సాలిడేషన్‌ రేంజ్‌ను కాపాడుకోగలిగింది. దీంతో నిఫ్టీలో తక్షణ పతనం భయాలు లేవని నిపుణులు భావిస్తున్నారు. అయితే అంతర్జాతీయ అంశాల ఆధారంగా తీవ్ర కదలికలుంటాయని

లాభాల ప్రారంభం

Monday 14th October 2019

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ సోమవారం లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 100 పాయింట్ల లాభంతో 38,227 వద్ద, నిఫ్టీ 30 పాయింట్లు పెరిగి 11,335.90 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించించాయి. అగ్రరాజ్యాలైన అమెరికా చైనాల మధ్య 15నెలల సుధీర్ఘ వాణిజ్య యుద్ధానికి ఉపశమనంగా శుక్రవారం ఇరుదేశాల మధ్య పాక్షిక ఒప్పందం కుదిరింది. ఫలితంగా గతవారంలో అమెరికా మార్కెట్లు దాదాపు 1శాతం లాభంతో ముగియగా, నేడు ఆసియా

Most from this category