News


12 పైసలు లాభపడిన రూపీ

Thursday 10th October 2019
Markets_main1570682138.png-28796

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో గురువారం ట్రేడింగ్‌లో 12 పైసలు బలపడి 70.95 వద్ద ప్రారంభమైంది. కాగా యుఎస్‌ నుంచి అదనపు వస్తువులను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చైనా ప్రభుత్వం ప్రకటించడంతో ఇరు దేశాల మధ్య పాక్షిక వాణిజ్య ఒప్పందం కుదురుతుందనే అంచనాలు పెరిగాయి. ఫలితంగా గత సెషన్‌లో దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. గత సెషన్లో రూపీ కూడా డాలర్‌ మారకంలో ప్రారంభ నష్టాలను పూడ్చుకొని 5 పైసల నష్టంతో 71.07 వద్ద ముగిసింది. యుఎస్‌ నుంచి అదనపు వస్తువులను చైనా కొనుగోలు చేయడానికి సుముఖత చూపడంతో చాలా వరకు ఆసియా కరెన్సీలు డాలర్‌ మారకంలో బలపడ్డాయని ఫారెక్స్‌ ట్రేడర్లు తెలిపారు.
  గత సెషన్లో ఎన్‌ఎస్‌ఈలో డాలర్‌-రూపీ అక్టోబర్‌ కాంట్రాక్ట్‌ 71.20 వద్ద ఉందని, ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ 0.42 శాతం తగ్గిందని ఐసీఐసీఐ డైరక్ట్‌ పేర్కొంది. డాలర్‌-రూపీకి అధిక స్థాయిల వద్ద ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉందని, దీనిని షార్ట్‌ పొజిషన్లు తీసుకోడానికి వినియోగించుకోవాలని ఈ బ్రోకరేజి సలహాయిచ్చింది.



You may be interested

పెరిగిన బంగారం

Thursday 10th October 2019

యుఎస్‌-చైనా వాణిజ్య చర్చలలో భాగంగా వాషింగ్టన్‌ వచ్చిన చైనా ప్రతినిధులు షేడ్యుల్‌కు ముందే తిరిగి చైనా వెళ్లనుండడంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద అవకాశాలు తగ్గాయి. ఫలితంగా ఇన్వెస్టర్లు బంగారాన్ని స్వర్గదామంలో చూస్తున్నారు. యుఎస్‌-చైనా వాణిజ్య యుద్ధం వలన గురువారం ట్రేడింగ్‌లో బంగారం ధరలు ఒక వారం గరిష్ఠానికి చేరుకున్నాయి. తక్షణ బంగారం 0.4 శాతం లాభపడి ఔన్సు 1,511.24 డాలర్లకు, యుఎస్‌ గోల్డ్‌ ప్యూచర్‌ 0.3 శాతం

పోటీతత్వంలో 10 స్థానాలు దిగువకు భారత్‌!

Thursday 10th October 2019

అంతర్జాతీయ పోటీతత్వ సూచీలో 68వ స్థానం క్రితం ఏడాది 58వ స్థానం నంబర్‌ 1 స్థానానికి సింగపూర్‌ రెండో స్థానానికి వెళ్లిపోయిన అమెరికా న్యూఢిల్లీ: అంతర్జాతీయ పోటీతత్వ సూచీలో భారత్‌ వెనుకబడింది.  అంతర్జాతీయ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) రూపొందించిన ‘గ్లోబల్‌ కాంపిటీటివ్‌ ఇండెక్స్‌’లో క్రితం ఏడాది 58వ స్థానంలో నిలిచిన భారత్‌, ఈ ఏడాది 68కి పరిమితమైంది. ప్రధానంగా ఇతర ఆర్థిక వ్యవస్థల పనితీరు మెరుగ్గా ఉండడం భారత్‌ వెనక్కి వెళ్లిపోవడానికి కారణం. కొలంబియా, దక్షిణాఫ్రికా,

Most from this category