News


18 పైసలు క్షీణించి..69.24 వద్ద రూపీ

Friday 2nd August 2019
Markets_main1564727433.png-27497

దేశీయ ఈక్విటీ మార్కెట్లలో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతోపాటు, బ్యాంకులు, దిగుమతిదారులు యుఎస్‌ కరెన్సీ డాలర్‌ను కొనుగోలు చేయడంతో రూపీ డాలర్‌ మారకంలో 18 పైసలు క్షీణించి శుక్రవారం(అగష్టు 02) ట్రేడింగ్‌లో 69.24 వద్ద ప్రారంభమైంది. గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 27 పైసలు క్షీణించి 69.06 వద్ద ముగిసిన విషయం తెలిసిందే. ఫెడరల్ రిజర్వ్ 25 బిపిఎస్ రేట్ల కోత చేసినప్పటికి ఈ రేట్ల కోత కొనసాగదని స్పష్టమైన సంకేతాలివ్వడంతో రూపీ డాలర్‌ మారకంలో బలహీన పడుతోందని మోతిలాల్‌ ఓస్వాల్‌ సర్వీసెస్‌ పేర్కొంది. కాగా ఫెడ్, రేట్లను దూకుడుగా తగ్గించడం లేదని  యుఎస్‌ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెంట్రల్‌ బ్యాంక్‌ను విమర్శించిన విషయం తెలిసిందే. 
  యుఎస్-చైనా ప్రతినిధుల మధ్య జరిగిన వాణిజ్య చర్చలో ఎటువంటి పురోగతి కనిపించలేదు. దీంతో పాటు సెప్టెంబర్‌ 1 నుంచి మిగిలిన 300 బిలియన్ డాలర్ల చైనా దిగుమతులపై 10 శాతం సుంకాన్ని విధించనున్నట్లు ట్రంప్ గురువారం వ్యాఖ్యానించడంతో అంతర్జాతీయ మార్కెట్లు పతనమయ్యాయి. ఈ చర్య జూన్‌లో ఏర్పడిన వాణిజ్య యుద్ధం సంధిని విచ్ఛిన్నం చేస్తుందని, ప్రపంచ సరఫరా గొలుసులను మరింత దెబ్బతీస్తుందని విశ్లేషకులు తెలిపారు. అంతేకాకుండా గత వారం విడుదలైన యుఎస్‌ ఉపాధి డేటా అంచనాల కంటే బలహీనంగా ఉండడంతో డాలర్‌ ప్రభావితమయ్యే అవకాశం ఉంది.
ఈ రోజు, రూపీ డాలర్‌ మారకంలో  69.05-69.50 పరిధిలో కదలాడవచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఒక నివేదికలో పేర్కొంది.



You may be interested

చమురు..భారీ పతనం

Friday 2nd August 2019

మిగిలిన 300 బిలియన్‌ డాలర్ల చైనా దిగుమతులపై ఈ సెప్టెంబర్‌ 1 నుంచి 10 శాతం సుంకాలు విధిస్తామని యుఎస్‌ అధ్యక్షుడు ట్రంప్‌ తెలపడంతో గురువారం సెషన్‌లో ముడి చమురు ధరలు భారీగా పడిపోయాయి. కాగా శుక్రవారం(అగష్టు 02) ట్రేడింగ్‌లో చమురు ధరలు పతనం నుంచి కోలుకుంటున్నాయి. బ్రెంట్ క్రూడ్‌ 2.7 శాతం పెరిగి బ్యారెల్కు 62.12 డాలర్ల వద్ద, డబ్ల్యుటిఐ క్రూడ్‌ 2.1 శాతం పెరిగి 55.10 డాలర్ల

జూలైలో తయారీ రంగం ఓకే!: పీఐఎం

Friday 2nd August 2019

న్యూఢిల్లీ: తయారీ రంగం జూలైలో కొంత మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ ఇండెక్స్‌  (పీఎంఐ) 52.5గా నమోదయ్యింది. జూన్‌లో ఈ సూచీ 52.1గా ఉంది. కొత్త ఆర్డర్లు రావడం, ఉత్పత్తి పటిష్టత తాజా సూచీ మెరుగుకు కారణం. కాగా ఈ సూచీ 50 లోపనకు పడిపోతేనే క్షీణతగా భావించడం జరుగుతుంది. లేదంటే, వృద్ధితీరుగానే భావించడం జరుగుతుంది. ఆ లెక్కన వరుసగా 24 నెలల నుంచీ

Most from this category