News


రూపాయి 30 పైసలు డౌన్‌

Saturday 15th June 2019
Markets_main1560575004.png-26314

69.80కి పతనం
ముంబై: ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ శుక్రవారం 30 పైసలు పడిపోయింది. 69.80 వద్ద ముగిసింది. గురువారం రూపాయి ముగింపు 69.50. ఒమన్‌ గల్ఫ్‌లో రెండు ఆయిల్‌ ట్యాంకర్లపై దాడులు... తత్ఫలితంగా సరఫరాల్లో సమస్యలు తలెత్తుతాయన్న ఆందోళనలు... దీనితో అంతర్జాతీయ మార్కెట్‌లో  క్రూడ్‌ ధరల తీవ్రత రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపాయి. డాలర్‌ మారకంలో ఆసియా దేశాల కరెన్సీ విలువల పతనం, దేశీయ ఈక్విటీ మార్కెట్ల నష్టాలు కూడా రూపాయి సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. వారంవారీగా రూపాయి 34 పైసలు బలహీనపడింది. శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో రూపాయి విలువ 69.55 వద్ద ప్రారంభమైంది. అయితే ఇంట్రాడే ట్రేడింగ్‌లో 68.85 స్థాయికి కూడా పడిపోయింది. అక్టోబర్‌ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అయితే క్రూడ్‌ ధరల  భారీ పతనం, ఎన్నికల అనంతరం మోదీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందన్న అంచనాల నేపథ్యంలో రూపాయి రెండు మూడు క్రితం 68 స్థాయినీ చూసింది. కాగా ఇటీవలి అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు, ఈక్విటీ మార్కెట్ల పతనం, డాలర్‌ బలోపేతం, క్రూడ్‌ ధరలు తిరిగి ఆందోళనకర స్థాయికి చేరుతుండడం వంటి అంశాలు రూపాయికి ప్రతికూలంగా మారాయి. తాజా ఎన్నికల ఫలితాలు తక్షణం రూపాయి సెంటిమెం‍ట్‌ను బలపరిచినా, క్రూడ్‌ ధరల పెరుగుదల, డాలర్‌ పటిష్టస్థాయి, అంతర్జాతీయ, దేశీయ ఆర్థిక అనిశ్చితులు దీర్ఘకాలంలో రూపాయి విలువను ఆందోళనకు గురిచేసేవే అని నిపుణుల అంచనా. 



You may be interested

కిర్గిజ్‌తో పెట్టుబడుల ఒప్పందానికి తుదిరూపు

Saturday 15th June 2019

ద్వైపాక్షిక వాణిజ్యం పెంపునకు ప్రణాళిక ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి బిష్కెక్‌: కిర్గిజిస్తాన్‌, భారత్‌ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంుచుకోవడానికి ఇరు దేశాలు అయిదేళ్ల మార్గదర్శ ప్రణాళికలను రూపొందించుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అలాగే, ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందం (డీటీఏఏ), ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందానికి తుది రూపు కూడా ఇచ్చినట్లు వెల్లడించారు. భారత్‌- కిర్గిజ్‌ బిజినెస్ ఫోరం సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ప్రధాని ఈ విషయాలు తెలిపారు. భారత్‌, కిర్గిజిస్థాన్‌

స్వల్పంగా తగ్గిన కార్పొరేషన్‌ బ్యాంక్‌ రుణ రేటు

Saturday 15th June 2019

న్యూఢిల్లీ: కార్పొరేషన్‌ బ్యాంక్‌ ఏడాది రుణ రేటు ఐదు బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) తగ్గింది. దీనితో ఈ రేటు 8.85 శాతానికి దిగివచ్చింది. గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీరేట్లు ఏడాది రుణ రేటుకు అనుసంధానమవుతాయి. ఇక ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్‌ (నిధుల సమీకరణ వ్యయ ఆధారిత) 8.85 శాతం నుంచి 8.80 శాతానికి తగ్గింది. ​మిగిలిన కాలపరిమితుల రుణరేట్లపై ఎటువంటి మార్పూ లేదు.

Most from this category