News


73కు చేరువలో రూపీ

Wednesday 12th September 2018
Markets_main1536726871.png-20178

అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి బుధవారం మరో కొత్త రికార్డ్‌ కనిష్ట స్థాయికి పతనమైంది. 73 మార్క్‌కు కేవలం 10 పైసలు దూరంలో నిలిచింది. క్రూడ్‌ ధరలు పెరగటం, వర్ధమాన కరెన్సీలు నష్టాల్లో ట్రేడవుతుండటం ప్రతికూల ప్రభావం చూపాయి. ఉదయం 9:15 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 72.89 వద్ద ట్రేడ్‌ అవుతోంది. తన మునపటి ముగింపు 72.70తో పోలిస్తే 0.25 శాతం తగ్గింది. ఇక డాలర్‌తో పోలిస్తే రూపాయి బుధవారం 72.75 వద్ద ప్రారంభమైంది. 72.90 స్థాయిని కూడా తాకింది.  
భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్‌ 8.221 శాతంగా ఉంది. ఇక బాండ్‌ ఈల్డ్‌ మునపటి ముగింపు స్థాయి 8.181 శాతంగా ఉంది. బాండ్‌ ఈల్డ్స్‌, రూపాయి విలువ పరస్పరం వ్యతిరేక దిశలో ఉంటాయి. 
ఈ ఏడాది మొత్తంగా చూస్తే రూపాయి 12.3 శాతం మేర బలహీన పడింది. విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్‌ నుంచి 538.2 మిలియన్‌​డాలర్లను, డెట్‌ మార్కెట్‌ నుంచి 6.38 బిలియన్‌ డాలర్లను వెనక్కు తీసుకున్నారు. 
బెంచ్‌మార్క్‌ సెన్సెక్స్‌ ఇండెక్స్‌ 133 పాయింట్ల లాభంతో 37,546కు పెరిగింది. జనవరి నుంచి చూస్తే ఇండెక్స్‌ 9.86 శాతం లాభపడింది.  
అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా ఆసియా ప్రధాన కరెన్సీలన్నీ నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. దక్షిణ కొరియా ఒన్‌ 0.21 శాతం, థాయ్‌ బట్‌ 0.15 శాతం, చైనా ఆఫ్‌షోర్‌ 0.14 శాతం, సింగపూర్‌ డాలర్‌ 0.12 శాతం, మలేసియా రింగిటల్‌ 0.08 శాతం క్షీణించాయి. అయితే జపాన్‌ యెన్‌ 0.14 శాతం, ఇండోనేసియా రుపియ 0.05 శాతం పెరిగాయి. 
ఇతర ప్రధాన కరెన్సీల్లో అమెరికా కరెన్సీ పటిష్టతను తెలియజేసే డాలర్‌ ఇండెక్స్‌ తన మునపటి ముగింపు 95.249తో పోలిస్తే 0.1 శాతం క్షీణతతో 95.154 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 
రిటైల్‌ ద్రవ్యోల్బణం, ఐఐపీ గణాంకాల వెల్లడి నేపథ్యంలో ట్రేడర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. You may be interested

జియోఫోన్లలో వాట్స్‌యాప్‌

Wednesday 12th September 2018

హైదరాబాద్‌: ఇక నుంచి రిలయన్స్‌ జియో విక్రయిస్తున్న అన్ని ఫోన్లలో వాట్స్‌యాప్‌ సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ విషయాన్ని మంగళవారం రిలయన్స్‌ రిటైల్‌ ఒక ప్రకటనలో తెలియజేసింది. భారత్‌లో అమ్ముడవుతున్న రూ.1,500 లోపు మొబైల్స్‌లో తమ మార్కెట్‌ వాటా 80 శాతానికి చేరుకుందని రిలయన్స్‌ ప్రకటించింది. ఈ విభాగానికి చెందిన ప్రతి 10 ఫోన్ల అమ్మకాలలో 8 జియో ఫోన్లు ఉంటున్నాయని, జియోఫోన్‌ ద్వారా ట్రాన్స్‌మిట్‌ అవుతున్న వాయిస్ సందేశాలు

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 12th September 2018

ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు సన్‌ఫార్మా:- యూఎస్‌ఎఫ్‌డీఏ పంబాజ్‌లోని మొహాలీ ప్లాంట్‌ను రెండురోజుల(సెప్టెంబర్‌ 10, 11) పాటు తనిఖీలు చేసినట్లు ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. సిన్జిన్ ఇంటర్నేషన్‌:- బయోకాన్‌ కంపెనీ తన మొత్తం వాటాలో నుంచి అరశాతం వాటాకు సమానమైన ఈక్విటీ షేర్లను సోమవారం ఓపెన్‌మార్కెట్‌ ద్వారా విక్రయించింది. సిప్లా:- హెచ్‌ఐవీ వ్యాధి చికిత్సలో వినియోగించే ట్రిపుల్‌ కాంబినేషన్‌ ఆప్‌ యాంటిరెట్రోవైరల్‌ ఔషధానికి ఎస్‌ఎహెచ్‌పీఆర్‌ఏ(సౌత్‌ ఆఫ్రికన్‌ హెల్త్‌ ప్రోడక్ట్స్‌

Most from this category