20 పైసలు బలపడిన రూపీ
By Sakshi

డాలర్ మారకంలో రూపీ గురువారం 20 పైసలు బలపడి 69.48వద్ధ ప్రారంభమైంది. ఫెడ్ సమావేశం బుధవారం సాయంత్రం జరగడంతో 69.68 వద్ధ ఫ్లాట్ గా ముగిసింది. రూపీ తక్కువ పరిధిలో కదలాడే అవకాశం ఉందని మోతిలాల్ ఉస్వాల్ అన్నారు. ఫెడ్ వడ్డి రేట్లను యదాతథంగా ఉంచినప్పటికి భవిష్యత్‌లో వడ్డిరేట్లను తగ్గించే అవకాశం ఉందని ఆయన వివరించారు. ఈ నిర్ణయం వెలువడిన తర్వాత డాలర్ బలహీన పడింది. యూఎస్‌లో ద్రవ్యోల్బణం 1.8శాతం నుంచి 1.5 శాతానికి తగ్గింది. వచ్చే ఏడాది కూడా లక్ష్యంగా పెట్టుకున్న 2శాతం ద్రవ్యోల్బణాన్ని కూడా అందుకోలేకపోవచ్చని నిపుణులంటున్నారు. ఈ రోజు ట్రేడింగ్‌లో డాలర్ మారకంలో రూపీ 69.20 నుంచి 69.90 పరిధిలో కదలాడొచ్చాని మోతిలాల్ తెలిపారు.
You may be interested
ఒక శాతం పెరిగిన చమురు ధరలు
Thursday 20th June 2019అమెరికా చమురు నిల్వలు ఊహించని దానికంటే ఎక్కువగా పడిపోవడంతో పాటు ఒపెక్ దేశాలు, ఇతర ఉత్పత్తి దేశాల సమావేశానికి తేదీ ఖరారు కావడంతో గురువారం చమురు ధరలు ఒక శాతం పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ 1.3శాతం పెరిగి బ్యారెల్ 62.64డాలర్ల వద్ద, డబ్యుటీఐ క్రూడ్ 1.5శాతం పెరిగి బ్యారెల్ 54.55డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. గత సెషన్లో బ్రెంట్ క్రూడ్ 0.5శాతం, డబ్యుటీఐ క్రూడ్ 0.26 శాతం నష్టపోయిన విషయం తెలిసిందే.
సెన్సెక్స్ 100 పాయింట్ల నష్టంతో ప్రారంభం
Thursday 20th June 2019దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ 100 పాయింట్ల నష్టంతో 39010 వద్ద, నిఫ్టీ 25 పాయింట్లు క్షీణించి 11666.50 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ నిన్నరాత్రి కీలక వడ్డీరేట్లపై యథాతథ పాలసీ అమలుకే కట్టుబడుతున్నట్లు ప్రకటించింది. అయితే ద్రవ్యోల్బణం, ఆర్థిక మందగమన అంశాలను దృష్టిలో ఉంచుకుని రానున్న రోజుల్లో అవసరమైతే వడ్డీరేట్లను తగ్గిస్తామని ఫెడ్ ఛైర్మన్ పావెల్ తెలిపారు. ఫలితంగా నిన్నరాత్రి అమెరికా