News


బ్రెక్సిట్ జోష్‌..బలపడిన రూపీ

Friday 18th October 2019
Markets_main1571373174.png-28965

దేశీయ కరెన్సీ రూపీ, డాలర్‌ మారకంలో స్వల్పంగా నష్టపోయి 71.19 వద్ద శుక్రవారం ప్రారంభమైంది. బ్రిటన్‌, ఈయూ(యురొపియన్‌ యూనియన్‌) మధ్య బ్రెక్సిట్‌ ఒప్పందం కుదరడంతో గత షెషన్‌లో దేశీయ ఈక్విటీ మార్కెట్లు ర్యాలీ చేశాయి. అంతేకాకుండా గత కొన్ని సెషన్ల నుంచి విదేశి సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్‌ఐఐ) కొనుగోళ్లు పెరగడంతో రూపీ డాలర్‌ మారకంలో బలపడుతూ వస్తోంది. బ్రెక్సిట్‌ ఒప్పందం కుదరడం, చమురు ధరలు తగ్గడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 27 పైసలు బలపడి 71.16 వద్ద ముగిసింది.  
  బ్రెక్సిట్‌ డీల్‌ స్వల్పకాలంలో ఉపశమనాన్ని ఇవ్వవచ్చని, కానీ ఈ ఒప్పందం, హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ అనుమతి పొందవలసి ఉండడంతో ప్రస్తుతం ఈ ఒప్పంద ప్రభావం తక్కువని మోతిలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌, ఫారెక్స్‌ అండ్‌ బుల్లియన్‌ విశ్లేషకులు గౌరాంగ్‌ సొమయా అన్నారు. వచ్చే రెండు మూడు రోజులలో ఈ ఒప్పందానికి సంబంధించి అప్‌డేట్స్‌ రానుండడంతో బ్రిటన్‌ పౌండ్‌పై ఒత్తిడి ఉండనుందని తెలిపారు. 
    ‘రూపీ గత కొన్ని సెషన్లలో 1 శాతానికి పైగా బలపడింది. యూఎస్‌-చైనా ఒప్పందం ఫేజ్‌ 1 పూర్తవ్వడంతో పాటు, బ్రెక్సిట్‌ ఒప్పందం వలన అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల కరెన్సీలు బలపడ్డాయి. వీటితో పాటు యుస్‌ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండడంతో డాలర్‌ ఇండెక్స్‌ పడిపోవడం, ఫెడ్‌ వడ్డీ రేట్లను మూడవ సారి కూడా తగ్గించనుందనే అంచనాలు పెరగడంతో రూపీ డాలర్‌ మారకంలో బలపడింది’ అని యామ్కే గ్లోబల్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌, కరెన్సీ హెడ్‌, రాహుల్‌ గుప్తా అన్నారు. బ్రిటన్‌ ప్రధాని చెప్పినట్టు బ్రెక్సిట్‌ ఒప్పందం బ్రిటన్‌ పార్లమెంట్‌లో ఆమోదం పొందితే, రూపీ మరింత బలపడుతుందని వివరించారు. ‘రూపీ డాలర్‌ మారకంలో 70.75 స్థాయి కీలక మధ్ధతు స్థాయిగా పనిచేయగలదు. ఇంకా బలపడితే 70.55 స్థాయి వరకు చేరుకోగలదు.పైన 71.50 స్థాయి కీలక నిరోధంగా పనిచేయగలదు’ అని తెలిపారు.You may be interested

స్టార్టప్‌లకు భారత్‌ స్వర్గధామం

Friday 18th October 2019

మూడో అతిపెద్ద దేశంగా పేర్కొన్న హరూన్‌  ముంబై: విజయవంతమైన ఎక్కువ స్టార్టప్‌లను కలిగిన మూడో అతిపెద్ద స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌గా భారత్‌ను ‘హరూన్‌ గ్లోబల్‌ యూనికార్న్‌ జాబితా 2019’ గుర్తించింది. చైనా, అమెరికా తర్వాత స్థానాన్ని మనకు కేటాయించింది. వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ (10 బిలియన్‌ డాలర్లు), ఓలా క్యాబ్స్‌ (6 బిలియన్‌ డాలర్లు), బైజూస్‌ (6 బిలియన్‌ డాలర్లు), ఓయోరూమ్స్‌ (5 బిలియన్‌ డాలర్లు) మన దేశం నుంచి విజయం సాధించిన

ఫైనాన్షియల్‌ అసెట్స్‌ వైపు పెట్టుబడులు

Friday 18th October 2019

మొగ్గుచూపుతున్న వ్యక్తిగత ఇన్వెస్టర్లు కార్వీ ప్రైవేట్‌ వెల్త్‌ నివేదికలో వెల్లడి హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: వ్యక్తిగత ఇన్వెస్టర్లు తమ సంపదను వృద్ధి చేసుకోవడానికి విభిన్న సాధనాల వైపు దృష్టిసారిస్తున్నారు. స్థలాలు, భవనాలు, బంగారం వంటి భౌతిక ఆస్తులకంటే అధికంగా ఈక్విటీ, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బీమా, ప్రావిడెంట్‌ ఫండ్‌, మ్యూచుఫల్‌ ఫండ్స్‌, ప్రైవేట్‌ ఈక్విటీ వంటి ఫైనాన్షియల్‌ అసెట్స్‌ వైపు మొగ్గుచూపుతున్నారని వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ కార్వీ ప్రైవేట్‌ వెల్త్‌ తన ఇండియా వెల్త్‌ రిపోర్ట్‌-2019లో

Most from this category