News


రూపాయి కట్టడికి దిగుమతులపై ఆంక్షలు..

Monday 24th September 2018
Markets_main1537764823.png-20495

న్యూఢిల్లీ:     రూపాయి పతనానికి అడ్డుకట్ట వేసే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకోనున్నట్లు కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ తెలిపారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువను 68-70 స్థాయికి తెచ్చే క్రమంలో నిత్యావసరయేతర ఉత్పత్తుల దిగుమతులపై ఆంక్షలు విధించడంతో పాటు త్వరలో మరిన్ని చర్యలు ఉంటాయని వివరించారు. ఇందులో భాగంగా ఆంక్షలు విధించతగ్గ నిత్యావసరయేతర ఉత్పత్తులతో ఒక జాబితాను తయారు చేసినట్లు, అలాగే ప్రోత్సహించతగ్గ ఎగుమతులతో మరో జాబితాను కేంద్రం రూపొందించినట్లు వివరించారు. రూపాయి ఏకంగా 12 శాతం మేర పతనం కావటం తాత్కాలికమైనదేనని ఆయన చెప్పారు. ప్రతిపాదిత చర్యలన్నింటినీ పూర్తిగా అమల్లోకి తేలేదని.. మిగతావన్నీ కూడా త్వరలోనే కేంద్రం ప్రకటిస్తుందని గర్గ్ చెప్పారు. తయారీ కంపెనీల విదేశీ రుణాల సమీకరణ నిబంధనలను, కార్పొరేట్ బాండ్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులపై పరిమితులను సడలించడం తదితర చర్యలు ఇప్పటికే తీసుకున్నప్పటికీ.. రూపాయి పతనం మాత్రం ఆగకుండా దాదాపు 72.91కి పడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో డాలర్‌తో పోలిస్తే 68-70 స్థాయిలో రూపాయి ఉంటే సహేతుకమైనదిగా భావించవచ్చని గర్గ్ పేర్కొన్నారు. 



You may be interested

ఫెడ్‌ నిర్ణయం, రూపాయి కదలికలే కీలకం..!

Monday 24th September 2018

న్యూఢిల్లీ: ఈవారంలో సూచీలు మరింత కన్సాలిడేషన్‌కు గురికావచ్చని మార్కెట్‌ పండితులు భావిస్తున్నారు. ముడి చమురు ధరల పెరుగుదల, డాలరు విలువ బలపడుతుండడం, ద్రవ్యలోటు వంటి పలు ఆందోళనకర అంశాల నేపథ్యంలో మార్కెట్‌ కన్సాలిడేషన్‌కు అవకాశం ఉందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పరిశోధన విభాగం హెడ్‌ వినోద్‌ నాయర్‌ అన్నారు. ‘అమెరికా ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ (ఎఫ్‌ఓఎమ్‌సీ) సమావేశం ఈవారంలో అత్యంత కీలక అంశంగా ఉంది. మన మార్కెట్లలో దిద్దుబాటు

స్వల్పంగా తగ్గిన పసిడి

Monday 24th September 2018

న్యూయార్క్‌:- ప్రపంచమార్కెట్లో సోమవారం పసిడి ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. డాలర్‌ పెరుగుదల ఇందుకు కారణమవుతోంది. ఆసియా మార్కెట్లో ఔన్స్‌ పసిడి భారత వర్తమానకాలం ఉదయం 10 గంటలకు ఔన్స్‌ పసిడి 2 డాలర్లు నష్టపోయి 1,200.10 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికాతో వాణిజ్య చర్చలు రద్దు చేసుకుంటున్నట్లు చైనా ప్రకటించింది. అలాగే అమెరికా- చైనాపై విధించిన 200 బిలియన్‌ డాలర్ల దిగుమతి వాణిజ్య పన్ను నేటి నుంచి

Most from this category