News


రూపాయికి నాల్గవ రోజూ లాభం

Saturday 11th January 2020
Markets_main1578714420.png-30850

  • 27 పైసలు పెరుగుదలతో
  • 70.94 వద్ద ముగింపు
  • నాలుగు రోజుల్లో 99పైసలు అప్‌

(అప్‌డేటెడ్‌...)

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ శుక్రవారం వరుసగా 4వ రోజూ లాభపడింది. 27పైసలు లాభంతో 70.94 వద్ద ముగిసింది. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గుముఖం పడుతుండడం ఇందుకు దోహదపడిన అంశం. ఈ నాలుగు రోజుల్లో రూపాయి విలువ 99 పైసలు బలపడింది. వారంలో 86 పైసలు (1.19 శాతం) లాభపడింది. గత ఏడాది అక్టోబర్‌ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అటు తర్వాత పలు సానుకూల అంశాలతో  రూపాయి క్రమంగా కీలక నిరోధం 68.50 వద్దకు చేరింది. రూపాయి మరింత బలోపేతం కావడానికి ఈ నిరోధం కీలకం. అయితే ఇక్కడ నుంచి రూపాయి ఏ దశలోనూ మరింత బలపడలేకపోయింది.  

రికార్డుస్థాయికి ఫారెక్స్‌ నిల్వలు...
మరోవైపు దేశంలోకి విదేశీ మారకద్రవ్య నిల్వలు మరింత పెరిగి, ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయిలకు చేరాయి. జనవరి 3తో ముగిసిన వారంలో 3.689 బిలియన్‌ డాలర్లు పెరిగి 461.157 బిలియన్‌ డాలర్లకు ఎగశాయి. 



You may be interested

యూఎస్‌ మార్కెట్‌ డౌన్‌- ఇన్ఫీ అప్‌

Saturday 11th January 2020

రికార్డ్‌ గరిష్టాల నుంచి వెనక్కి ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ 1.6 శాతం ప్లస్‌  టాటా మోటార్స్‌ 2 శాతం అప్‌ వారాంతాన అమెరికా స్టాక్‌ మార్కెట్లు చివర్లో డీలాపడ్డాయి. తొలుత రికార్డ్‌ గరిష్టాలను అందుకున్న మార్కెట్లు తదుపరి ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో వెనకడుగు వేశాయి. వెరసి శుక్రవారం డోజోన్స్‌ 133 పాయింట్లు(0.45 శాతం) నీరసించి 28,824 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 9 పాయింట్లు(0.3 శాతం) తక్కువగా 3,265 వద్ద స్థిరపడింది. నాస్‌డాక్‌ 25 పాయింట్లు(0.3 శాతం) క్షీణించి

టాటాలకు సుప్రీం ఊరట

Saturday 11th January 2020

ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా మిస్త్రీ పునర్‌నియామకపు ఉత్తర్వుపై స్టే న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీని పునర్‌నియమించాలన్న ఎన్‌సీఎల్‌ఏటీ ( నేషనల్‌ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్‌) ఉత్తర్వులపై అత్యున్నత న్యాయస్థానం- సుప్రీంకోర్టు శుక్రవారం స్టే ఇచ్చింది. ట్రిబ్యునల్‌ ఇచ్చిన ఉత్తర్వ్యులను పూర్తి స్థాయిలో విచారించాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది. కేసును మరోరోజు పూర్తిస్థాయిలో విచారణకు చేపట్టనున్నట్లు తెలిపింది.  ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌,

Most from this category