News


రూపాయికి ‘కోవిడ్‌’ ‍కాటు

Tuesday 24th March 2020
Markets_main1585021370.png-32649

  • ఒకేరోజు 102 పైసలు పతనం
  • 76.22 వద్ద ముగింపు
  • ఇంట్రాడేలో ఏకంగా 76.30కి బలహీనం
  • ఏ రోజుకారోజు కొత్త కనిష్టాలు...
  • మూడు ట్రేడింగ్‌ సెషన్లలో ఇదే పరిస్థితి

ముంబై: ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ సోమవారం వరుసగా మూడవరోజు ట్రేడింగ్‌ సెషన్‌లోనూ మరింత ‘చరిత్రాత్మక’ దిగువస్థాయికి  కిందకుపడిపోయింది. శుక్రవారం ముగింపుతో పోల్చితే ఏకంగా 102 పైసలు బలహీనపడి 76.22కి పడిపోయింది. ఈ స్థాయిని ఎప్పుడూ రూపాయి చూడలేదు.  ఇంట్రాడేలో రూపాయి విలువ  ఏకంగా 76.30నీ చూసింది. అటు ముగింపు ఇటు ఇంట్రాడే పతనం రెండూ రూపాయికి చరిత్రాత్మక కనిష్ట స్థాయిలు కావడం గమనార్హం.  వరుసగా మూడు ట్రేడింగ్‌ సెషన్లలో రూపాయి విలువ ఏరోజుకారోజు కొత్త కనిష్ట స్థాయిలను చూస్తోంది. దేశంలో కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తుండడం, దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం, ఈక్విటీ మార్కెట్ల భారీ నష్టాలు తాజా పరిస్థితి నేపథ్యం. ఆరు దేశాల కరెన్సీలతో ట్రేడయ్యే డాలర్‌ ఇండెక్స్‌ 103 స్థాయికి బలోపేతం కావడం కూడా ఇక్కడ గమనార్హం.  శుక్రవారం రూపాయి ముగింపు 75.20. సోమవారం ప్రారంభంతోనే 75.90 వద్ద బలహీన ధోరణిలో ప్రారంభమయ్యింది. 75.86 స్థాయిని చూసినా... ఆ స్థాయి నుంచి ఏ మాత్రం మెరుగుపడలేకపోయింది. 



You may be interested

8000 పైన ప్రారంభమైన నిఫ్టీ

Tuesday 24th March 2020

1259.69 లాభంతో మొదలైన సెన్సెక్స్‌ నిన్నటి ట్రేడింగ్‌లో అతిపెద్ద పతనాన్ని చవిచూసిన దేశీ స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం భారీ గ్యాప్‌తో మొదలైంది. సెన్సెక్స్‌ 1259.69 లాభంతో 27240.93 వద్ద, నిఫ్టీ 400.75 పాయింట్లు పెరిగి 8002.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నిన్న భారీ పతనం నేపథ్యంలో ట్రేడర్ల షార్ట్‌కవరింగ్‌, నేడు ఆసియాలోని ప్రధాన మార్కెట్లు లాభాల్లో ట్రేడింగ్‌ అవుతుండటం, డాలర్‌ మారకంలో రూపాయి నిన్నటి ముగింపు( 76.29)తో పోలిస్తే 22పైసల లాభంతో

నిత్యావసర వస్తువుల తయారీకి ఆటంకం వద్దు: ప్రధాని మోదీ

Tuesday 24th March 2020

ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పించాలి పారిశ్రామికవేత్తలకు ప్రధాని సూచనలు న్యూఢిల్లీ: నిత్యావసర వస్తువుల ఉత్పత్తికి ఎటువంటి ఆటంకాల్లేకుండా చూడాలని పారిశ్రామికవేత్తలను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. కరోనా వైరస్‌ నియంత్రణ కార్యాచరణలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం పారిశ్రామికవేత్తలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. టెక్నాలజీ సాయంతో ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసేందుకు అనుమతించాలని కోరారు. ‘‘ఆర్థిక వ్యవస్థపై ప్రభావం కొంత కాలం పాటు ఉంటుంది. వ్యాపారాలపై ప్రతికూల

Most from this category