News


ఆల్‌టైమ్‌ గరిష్టానికి ఫారెక్స్‌ నిల్వలు

Saturday 16th November 2019
Markets_main1573875658.png-29629

  • 447.81 బిలియన్‌ డాలర్లకు చేరిక

ముంబై: విదేశీ మారక(ఫారెక్స్‌) నిల్వలు ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయికి చేరాయి. ఆర్‌బీఐ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. నవంబర్‌ 8తో ముగిసిన వారానికి ఫారెక్స్‌ నిల్వలు 1.710 బిలియన్‌ డాలర్లు పెరిగి 447.81 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. గ‌తవారం ఈ నిల్వలు 446.098 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. విదేశీ మారక నిల్వల్లో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు (ఎఫ్‌సీఏలు) పెరగిన కారణంగానే రికార్డు నమోదైందని ఆర్‌బీఐ తెలిపింది. ఈ వారంలో ఎఫ్‌సీఏలు 2.174 బిలియన్‌ డాలర్లు పెరిగి 415.828 బిలియ‌న్ డాలర్లకు చేరాయి. ఇక బంగారం నిల్వలు 443 మిలియన్‌ డాలర్లు తగ్గి 26.910 బిలియన్‌ డాలర్లకు చేరగా... అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌) వద్ద స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ విలువ 3 మిలియన్‌ డాలర్లు తగ్గి రూ. 1.44 బిలియన్‌ డాలర్‌గా నమోదయ్యాయి. 



You may be interested

ఎన్‌బీఎఫ్‌సీల దివాలా ప్రక్రియకు మార్గదర్శకాలు

Saturday 16th November 2019

న్యూఢిల్లీ: బ్యాంకులు కాకుండా వ్యవస్థాగతంగా కీలకమైన ఇతరత్రా ఆర్థిక సేవల సంస్థల(ఎఫ్‌ఎస్‌పీ) దివాలా ప్రక్రియ, మూసివేతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ప్రకటించింది. కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ వీటిని నోటిఫై చేసింది. దివాలా కోడ్‌లోని సెక్షన్‌ 227 ప్రకారం.. వ్యవస్థాగతంగా ఏయే ఎఫ్‌ఎస్‌పీలు కీలకమైనవి, ఏవి ఆ పరిధిలోకి రావన్నది కేంద్ర ప్రభుత్వం కేటగిరీల వారీగా నిర్ణయిస్తుంది. ఆర్థిక రంగ నియంత్రణ సంస్థలతో సంప్రతింపుల మేరకు సంక్షోభంలో ఉన్న ఎఫ్‌ఎస్‌పీల

డిపాజిట్లపై ఇన్సూరెన్స్‌ పెంపు శీతాకాల సమావేశాల్లోనే!

Saturday 16th November 2019

న్యూఢిల్లీ: బ్యాంకు డిపాజిట్లపై ప్రస్తుతమున్న రూ.లక్ష బీమా మొత్తాన్ని మరింతగా పెంచేందుకు అవసరమైన చట్టాన్ని రానున్న పార్లమెంటు సమావేశాల్లోనే తీసుకురానున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. అలాగే, కోపరేటివ్‌ బ్యాంకుల నియంత్రణకు సంబంధించిన చట్టాన్ని కూడా తేనున్నట్టు చెప్పారు. మంత్రి శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. సంక్షేమ కార్యక్రమాలపై వ్యయాలకు కోత విధించే ప్రణాళికేమీ లేదన్నారు. బడ్జెట్‌లో కేటాయించిన మేరకు పూర్తి నిధుల వినియోగం దిశగా అన్ని

Most from this category