News


జీవితకాల గరిష్టస్థాయికి ఫారెక్స్ నిల్వలు

Saturday 23rd November 2019
Markets_main1574481471.png-29803

  • 448.2 బిలియన్ డాలర్లుగా నమోదు

ముంబై: విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్ రిజర్వ్స్) జీవితకాల గరిష్టస్థాయికి చేరాయి. ఆర్‌బీఐ తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఈఏడాది నవంబర్‌ 15తో ముగిసిన వారంలో 441 మిలియన్‌ డాలర్ల పెరుగుదలతో 448.249 బిలియన్ డాలర్లకు ఎగశాయి. జీవితకాల గరిష్ట స్థాయిని తిరగరాశాయి. అంతక్రితం వారం 1.71 బిలియన్‌ డాలర్లు పెరిగి 447.808 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక తాజా వారంలో.. మొత్తం మారక నిల్వల్లో ప్రధాన భాగంగా డాలర్ల రూపంలో పేర్కొనే విదేశీ కరెన్సీ ఆస్తులు (ఎఫ్‌సీఏ) 643 మిలియన్‌ డాలర్లు పెరిగి 416.472 బిలియన్ డాలర్లకి చేరాయి. (అమెరికా డాలర్ మినహాయించి మిగిలిన కరెన్సీలైన యూరో, పౌండ్, యెన్ వంటి ఇతర నిల్వల పెరుగుదల/తరుగుదలను డాలర్లలోనికి మార్చి లెక్కిండాన్నే ఎఫ్సీఏగా వ్యవహరిస్తారు.) బంగారం నిల్వలు 200 మిలియన్‌ డాలర్లు తగ్గి 26.709 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంతర్జాతీయంగా ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) వద్ద ఉన్న స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ విలువ 5 మిలియన్ డాలర్లు పెరిగి 1.435 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ నిధి వద్ద ఉన్నటువంటి దేశీ నిల్వలు 3 మిలియన్‌ డాలర్లు పెరిగి 3.633 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. 



You may be interested

మ్యూచువల్‌ ఫండ్స్‌ వ్యాపారంలోకి ముత్తూట్‌ ఫైనాన్స్‌

Saturday 23rd November 2019

రూ.215 కోట్లకు ఐడీబీఐ ఏఎంసీ కొనుగోలు న్యూఢిల్లీ: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ) ముత్తూట్‌ ఫైనాన్స్‌ కొత్తగా మ్యూచువల్‌ ఫండ్స్ వ్యాపారంలోకి అడుగుపెడుతోంది. రూ.215 కోట్లతో ఐడీబీఐ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (ఐడీబీఐ ఏఎంసీ), ఐడీబీఐ మ్యూచువల్‌ పండ్‌ ట్రస్టీ కంపెనీలో నూరు శాతం ఈక్విటీని కొనుగోలు చేయనున్నట్టు ముత్తూట్‌ ఫైనాన్స్‌ ‍శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఇందుకు ఒప్పందం చేసుకున్నట్టు తెలిపింది. ఈ డీల్‌కు సెబీ తదితర నియంత్రణ సంస్థల ఆమోదం

బీపీసీఎల్‌, కాంకర్‌ విక్రయానికి బిడ్లకు ఆహ్వానం

Saturday 23rd November 2019

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని బీపీసీఎల్‌, కంటెయినర్‌ కార్పొరేషన్‌ (కాంకర్‌)లో వ్యూహాత్మక వాటాల విక్రయానికి సంబంధించి పెట్టుబడులు, ప్రజా ఆస్తుల విభాగం (దీపమ్‌) ఆసక్తి కలిగిన సంస్థల నుంచి ప్రతిపాదనలకు ఆహ్వానం పలికింది. బీపీసీఎల్‌లో ప్రభుత్వం పూర్తి వాటాను విక్రయించనుండగా, కాంకర్‌లో మాత్రం 24 శాతం మేర వాటాను తన వద్దే అట్టిపెట్టుకుని మిగిలిన వాటాను, యాజమాన్య నియంత్రణను ప్రైవేటు సంస్థకు కట్టబెట్టనుంది. బీపీసీఎల్‌కు అసోంలో ఉన్న నుమాలిగఢ్‌ రిఫైనరీని మాత్రం ప్రభుత్వరంగ

Most from this category