News


రికార్డుస్థాయికి ఫారెక్స్‌ నిల్వలు

Saturday 17th August 2019
Markets_main1566033884.png-27836

దేశీయ ఫారెక్స్‌ నిల్వలు జీవితకాల గరిష్టానికి చేరుకున్నాయి. విదేశీ కరెన్సీ ఆస్తులు ఆగస్ట్‌ 9తో ముగిసిన వారానికి 1.620 బిలియన్ల డాలర్లకు పెరిగి 430.572 డాలర్లకు చేరుకున్నట్లు ఆర్‌బీఐ గణాంకాలు సూచిస్తున్నాయి. అంతకుముందు వారం(ఆగస్ట్‌ 02 తేది వారం) 697.2 డాలర్ల తగ్గుదలతో 428.952 బిలియన్‌ డాలర్లకు పడిపోయాయి.  అయితే గతవారంలో విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ 15.2 మిలియన్ డాలర్లు పెరిగి 398.739 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని పేర్కొంది. అలాగే 1.591 బిలియన్ డాలర్ల మేర పసిడి రిజర్వులు  పెరగడంతో ఆ ఆస్తులు 26.754 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఆర్‌బీఐ డేటా వెల్లడిస్తున్నది. స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ 6.7 మిలియన్ డాలర్లు పెరిగి 1.441 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.



You may be interested

మార్కెట్‌ నుంచి 20 శాతం రాబడులు పొందొచ్చు

Saturday 17th August 2019

‘పన్నులు, జీఎస్‌టీ, వడ్డీ రేట్లను తగ్గించడం, నిర్మాణాత్మక సంస్కరణలను ప్రభుత్వం తీసుకు రావడం వంటివి జరిగి,  ప్రపంచఆర్థిక పరిస్థితి అనుకూలంగా మారితే దేశియ మార్కెట్‌ 15-20 శాతం రిటర్న్‌లను ఇవ్వగలదు’ అని మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో డైరెక్టర్, సీఐఓ మిహిర్ వోరా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.. మార్కెట్‌ను నడిపింది..కొన్ని స్టాకులే! గత ఏడాది నుంచి గమనిస్తే నిప్టీ, ఎస్‌ అండ్‌ పీ సెన్సెక్స్‌ను నడిపించినవి కేవలం

త్వరలో ఉజ్జీవన్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ఐపీఓ

Saturday 17th August 2019

సెబీకి ఐపీఓ ముసాయిదా పత్రాలు సమర్పణ రూ.1200 కోట్ల సమీకరణ ఫైనాన్స్‌ రంగలో సేవలు అందించే ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌(ఐపీఓ)కు సిద్ధమైంది. ఐపీఓ ద్వారా బ్యాంకు మొత్తం రూ.1200 కోట్ల నిధులను సమీరించే యోచనలో ఉంది. ఈ మేరకు అనుమతుల కోసం ఆగస్ట్‌ 16న మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించింది. ఐపీఓకు బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా కోటక్‌ మహీంద్రా క్యాపిటల్‌ బ్యాంక్‌,

Most from this category