News


71.56 వద్ద ప్లాట్‌గా ప్రారంభమైన రూపీ

Thursday 22nd August 2019
Markets_main1566446090.png-27931

రూపీ డాలర్‌మారకంలో గురువారం 71.56 వద్ద ప్లాట్‌గా ప్రారంభమైంది. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలు డాలర్‌మారకంలో బలపడడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 16 పైసలు బలపడి 71.55 వద్ద ముగిసింది. కాగా గత సెషన్‌లో బుల్లిష్‌గా ప్రారంభమైన రూపీ 71.36 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకిన విషయం గమనార్హం. రూపీ డాలర్‌ మారకంలో అగష్టు కాంట్రాక్ట్‌ బుధవారం 71.59గా ఉండగా, ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ 8.09 శాతం క్షీణించిందని ఐసీఐసీఐ డైరక్ట్‌ తెలిపింది. ‘రూపీకి డాలర్‌ మారకంలో తక్కువ స్థాయిల వద్ద మద్ధతు లభించే అవకాశం ఉంది. ఈ నష్టాలను లాంగ్‌ పొజిషన్లు తీసుకోడానికి ఉపయోగించుకొండి’ అని ఈ బ్రోకరేజి సలహాఇచ్చింది.



You may be interested

సెబీ స్మార్ట్‌ నిర్ణయాలు

Thursday 22nd August 2019

ఆమోదం తెలిపిన సెబీ  సూచీల్లోకి స్టార్టప్‌లు మ్యూచువల్‌ ఫండ్స్‌కు ఇన్వెస్ట్‌మెంట్‌ సూచనలు  మరికొన్ని ప్రతిపాదనలకు సెబీ పచ్చజెండా    స్టార్టప్‌లకు జోష్‌నిచ్చే నిర్ణయాలను సెబీ తీసుకుంది. మునిసిపల్‌ బాండ్ల జారీ ద్వారా నిధులు సమీకరించుకునే వెసులుబాటును స్మార్ట్‌ సిటీస్‌కు కల్పించింది. వీటితో పాటు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చే నిర్ణయాలను కూడా ప్రకటించింది. మరోవైపు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కేసులకు సంబంధించి సమాచారమందించే వ్యక్తులకు రూ. కోటి నజరానా ఇస్తామని ప్రకటించింది. హౌసింగ్‌ ఫైనాన్స్‌, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌

పార్లేలో 10 వేల ఉద్యోగాలకు ఎసరు

Thursday 22nd August 2019

ఏడాది కాలంలో తీసేసే అవకాశం జీఎస్‌టీ ప్రభావం, డిమాండ్ క్షీణతే కారణం ముంబై: అమ్మకాలు పడిపోతుండటంతో వివిధ రంగాల సంస్థలు ఉత్పత్తిని తగ్గించుకునే క్రమంలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా బిస్కెట్ల తయారీ సంస్థ పార్లే కూడా ఈ జాబితాలో చేరనుంది. స్థూల ఆర్థిక పరిస్థితులు ఆశావహంగా లేకపోవడంతో వచ్చే ఏడాది కాలంలో సుమారు 10,000 మంది దాకా ఉద్యోగులను తొలగించాల్సి రావొచ్చని పార్లే ప్రోడక్ట్స్‌ విభాగం హెడ్ మయాంక్ షా తెలిపారు. సామాన్యుల

Most from this category