బలపడిన రూపీ..71.45 వద్ద ప్రారంభం
By Sakshi

రూపీ డాలర్ మారకంలో బుధవారం 25 పైసలు బలపడి 71.45 వద్ద ప్రారంభమైంది. అనిశ్చితిలో ఉన్న దేశియ ఆర్థిక వ్యవస్థ కారణాన గత సెషన్లో రూపీ డాలర్‌మారకంలో మరో 28 పైసలు బలహీనపడి 71.70 వద్ద ముగిసింది. ఆర్థిక మందగమనం, విదేశీ నిధుల ఔట్‌ఫ్లో దృక్పథం, చాలా వరకు అభివృద్ధి చెందుతున్న మార్కెట్ కరెన్సీలలో బలహీనత వంటి అంశాల వలన ఫారెక్స్ ఇన్వెస్టర్లు జాగ్రత్త వహిస్తున్నారు. కాగా వివిధ రంగాలలో వినియోగదారుల డిమాండ్ మందగించడాన్ని నిరోధించడానికి ప్రభుత్వం త్వరలోనే ఉద్దీపన చర్యలతో ముందుకు వస్తుందని మార్కెట్లు అంచనా వేస్తున్నాయి. గత సెషన్లో ఎన్ఎస్ఈలో డాలర్-రూపాయి ఆగస్టు కాంట్రాక్టు 71.75గా ఉండగా, ఓపెన్ ఇంట్రెస్ట్ 6.18 శాతం క్షీణించిందని ఐసిఐసిఐడైరెక్ట్ తెలిపింది. ‘రూపీకి డాలర్ మారకంలో దిగువ స్థాయిల వద్ద మద్ధతు లభించనుంది. ఈ నష్టాలను లాంగ్‌పొజిషన్లు తీసుకోడానికి ఉపయోగించుకోండి’ అని వివరించింది.
You may be interested
బుధవారం వార్తల్లోని షేర్లు
Wednesday 21st August 2019వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు సన్‌ఫార్మా అడ్వాన్డ్స్ రీసెర్చ్:- టాక్లాంటిస్ ఇంజెక్షన్ కోసం కంపెనీ యూఎస్ఎఫ్డీఏ అనుమతులు కోసం ధాఖలు చేయడం ఆరెంజ్ బుక్ లిస్టెడ్ పేటెంట్లను ఉల్లంఘించే చర్య అని ఆరోపిస్తూ యుఎస్ కంపెనీ అబ్రక్సిస్ బయోసైన్సెస్ ఎల్ఎల్సి యూఎస్ కోర్టులో పిటిషన్ ధాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ అర్హత లేకుండా ఉందని, ఈ ఆరోపణలు అర్థరహితంగా ఉన్నట్లు కంపెనీ అభిప్రాయపడింది. స్పైస్ జెట్, ఇండిగో:-
తగ్గిన నిల్వలు..పెరిగిన చమురు
Wednesday 21st August 2019యుఎస్ చమురు నిల్వలు అంచనాల కంటే అధికంగా తగ్గడంతో చమురు ధర బుధవారం ట్రేడింగ్‌లో 60 డాలర్ల పైకి చేరుకుంది. కానీ అంతర్జాతీయ మందగమన భయాలు చమురు లాభాలను తగ్గిస్తుండడం గమనార్హం. బ్రెంట్ క్రూడ్ 0.2 శాతం పెరిగి బ్యారెల్‌కు 60.16 డాలర్లకు చేరుకోగా, డబ్యూటీఐ క్రూడ్ 0.2 శాతం పెరిగి బ్యారెల్‌కు 56.25 డాలర్లకు చేరుకుంది. కాగా బ్రెంట్ క్రూడ్ గత సెషన్లో 0.5 శాతం లాభపడి ముగిసిన