News


సరికొత్త రికార్డులకు విదేశీ మారక నిల్వలు

Saturday 4th January 2020
Markets_main1578112114.png-30666

ముంబై: భారత్‌ విదేశీ మారకపు నిల్వల రికార్డుల జోరు కొనసాగుతోంది. డిసెంబర్‌ 27వ తేదీతో ముగిసిన వారంలో నిల్వలు 2.52 బిలియన్‌ డాలర్లు పెరిగి 457.46 బిలియన్‌ డాలర్లకు ఎగశాయి. ఆర్‌బీఐ శుక్రవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. ముఖ్యాంశాలు చూస్తే...

  • డాలర్ల రూపంలో పేర్కొనే విదేశీ కరెన్సీ అసెట్స్‌ విలువ 2.20 బిలియన్‌ డాలర్లు ఎగసి 424.936 బిలియన్లకు చేరింది. 
  • పసిడి నిల్వల విలువ  27.392 బిలియన్‌ డాలర్లకు చేరాయి. 
  • అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) వద్ద స్పెషల్‌ డ్రాయింగ్స్‌ రైట్స్‌ విలువ  1.441 బిలియన్‌ డాలర్లుగా ఉంది.  
  • ఫండ్‌ వద్ద దేశ నగదు నిల్వల పరిమాణం 3.7 బిలియన్‌ డాలర్లకు చేరింది. 



You may be interested

ఎన్‌ఎస్‌ఈలో 1 శాతం వాటా విక్రయం: ఎస్‌బీఐ

Saturday 4th January 2020

న్యూఢిల్లీ: నేషనల్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌(ఎన్‌ఎస్‌ఈ)లో 1.01 శాతం వాటాను ఎస్‌బీఐ (స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా)విక్రయించనున్నది. మూలధన నిధుల సమీకరణలో భాగంగా 1.01 శాతం వాటాకు సమానమైన 50 లక్షల షేర్లను విక్రయించనున్నామని ఎస్‌బీఐ వెల్లడించింది. కాంపిటేటివ్‌ బిడ్డింగ్‌ ప్రక్రియ ద్వారా ఈ షేర్లను విక్రయిస్తామని తెలిపింది. నిర్దేశిత ఫార్మాట్‌లో కనీసం పది లక్షల షేర్లకు బిడ్‌ చేయాల్సి ఉంటుందని, ఆసక్తి గల సంస్థలు ఈ నెల 15 వ

భారత్‌కు అనుకూలించిన అంతర్జాతీయ వాతావరణం

Saturday 4th January 2020

2019లో అత్యధికంగా పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు ఇదే పరిస్థితి 2020లోనూ కొనసాగొచ్చు: డీబీఎస్‌ సింగపూర్‌: భారత ఆర్థిక వ్యవస్థ 2019లో అంతర్జాతీయంగా ఉన్న సానుకూల వాతావరణంతో ప్రయోజనం పొందిందని, ఈక్విటీ, డెట్‌ విభాగాల్లో విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు కొన్నేళ్ల గరిష్ట స్థాయికి చేరాయని సింగపూర్‌కు చెందిన బ్యాంకింగ్‌ గ్రూపు డీబీఎస్‌ ఓ నివేదికలో పేర్కొంది. ఇదే పరిస్థితి నిలకడగా కొనసాగితే ఆర్థిక వ్యవస్థకు మరింత ప్రయోజనం లభిస్తుందని తెలిపింది. తక్కువ వడ్డీ రేట్ల కారణంగా

Most from this category