News


యస్‌బ్యాంక్‌ 58శాతం జంప్‌..!

Monday 16th March 2020
Markets_main1584343588.png-32504

మార్కెట్‌ భారీ పతనంలో యస్‌ భారీగా ర్యాలీ చేస్తోంది. బీఎస్‌ఈలో సోమవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో 53శాతం పెరిగింది. నేడు ఈ షేరు రూ.23.15 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. సంక్షోభంలో ఉన్న బ్యాంక్‌ను గట్టిక్కించేందుకు ఎస్‌బీఐతో పాటు ఇతర బ్యాంకులు వాటాల కొనుగోలు చేసేందుకు రూపొందించిన ప్రణాళికకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ కారణంగా నేడు మార్కెట్‌ ప్రారంభం నుంచి ఈ షేరు కొనుగోలుకు ఇన్వెస్టర్లు ఆస్తకి చూపారు. దీంతో షేరు ఒక దశలో 58శాతం పెరిగి రూ.40.40 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం 12గంటలకు షేరు క్రితం ముగింపు(రూ.25.55)తో పోలిస్తే 41శాతం లాభంతో రూ.36.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. యస్‌ బ్యాంకులో ఎస్‌బీఐతో పాటు ఐసీఐసీఐ బ్యాంక్‌ రూ. 1,000 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ కూడా రూ. 1,000 కోట్లు, యాక్సిస్‌ బ్యాంక్‌ సైతం రూ. 600 కోట్లు, కోటక్‌ మహీంద్రా బ్యాంకు కూడా రూ. 500 కోట్లు ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లు ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చాయి. వీటికి తోడు ఫెడరల్‌ బ్యాంక్‌ రూ.300 కోట్లు, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ రూ.300 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు తమ బోర్డు బోర్డుల నుంచి అనుమతి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక షేరు ఏడాది కనిష్ట గరిష్ట ధరలు వరుసగా రూ.5.55, రూ.285.90లుగా నమోదయ్యాయి. 



You may be interested

కరోనా ఎఫెక్ట్‌: దివాలా దిశగా విమానయాన సంస్థలు!

Monday 16th March 2020

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల్లో వేగంగా విస్తరిస్తుండడంతో మే నెల చివరినాటికి విమానయాన సంస్థలన్నీ దివాలా తీస్తాయని గ్లోబల్‌ ఏవియేషన్‌ కన్సల్టెన్సీ సీఏపీఏ వెల్లడించింది. ఆయా దేశాల ప్రభుత్వాలు విమానయాన సంస్థలతో కలిసి వెంటనే  చర్యలు చేపడితే విపత్తునుంచి తప్పించుకునే అవకాశం ఉందని  తెలిపింది. కరోనా వేగంగా వ్యాపిస్తుండడంతో ఇప్పటికే చాలా విమానయాన సంస్థలు సాంకేతికంగా దివాలా తీసాయని, రుణ ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొంది. కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ

52 వారాల కనిష్టానికి పడిపోయిన షేర్లు

Monday 16th March 2020

సోమవారం ఎన్‌ఎస్‌ఈలో 271 షేర్లు 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. వాటిలో 21ఫస్ట్‌ సెంచురీ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌, 3పీ ల్యాండ్‌ హోల్డింగ్స్‌, ఆదిత్యా బిర్లా సన్‌లైఫ్‌ నిఫ్టీ నెక్ట్స్‌ 50 ఈటీఎఫ్‌, ఏడీసీ ఫుడ్స్‌, ఆధునిక్‌ ఇండస్ట్రీస్‌, అద్వానీ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ ఇండియా, అగ్రి టెక్‌ ఇండియా, ఆగ్రోఫోస్‌ ఇండియా, ఏషియన్‌ హోటల్స్‌(ఈస్ట్‌), అక్స్‌ ఆఫ్టిఫైబర్‌, ఆంధ్రా సిమెంట్స్‌, అన్సాల్‌ హౌసింగ్‌, అపోలో సింధూరి హోటల్స్‌, ఆర్చిస్‌, ఆర్కోటెక్‌,

Most from this category