News


యస్‌ బ్యాంక్‌ హైజంప్‌- ఎస్‌బీఐ బోర్లా

Monday 9th March 2020
Markets_main1583736762.png-32362

యస్‌ బ్యాంక్‌కు ఎస్‌బీఐ పుష్‌
41 శాతం దూసుకెళ్లిన షేరు
స్టేట్‌బ్యాంక్‌ 5 శాతం పతనం

ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంకులో మెజారిటీ వాటా కొనుగోలుకి సిద్ధపడుతున్న వార్తలు ఈ రెండు కౌంటర్లపైనా విభిన్నంగా ప్రభావం చూపుతోంది.ఎన్‌ఎస్‌ఈలో ఉదయం 11.20 ప్రాంతం‍లో యస్‌ బ్యాంక్‌ షేరు 41 శాతం దూసుకెళ్లింది. రూ. 23 సమీపానికి చేరింది. ఇక మరోపక్క యస్‌ బ్యాంకును సొంతం చేసుకోన్ను పీఎస్‌యూ దిగ్గజం స్టేట్‌బ్యాంక్‌ షేరు 5 శాతం పతనమై రూ. 258 వద్ద ట్రేడవుతోంది. గత ముగింపు రూ. 270కాగా.. 260 వద్ద ప్రారంభమైంది. తదుపరి రూ. 254 వరకూ దిగజారింది. ఇటీవల యస్‌ బ్యాంకు బోర్డును రద్దు చేసిన రిజర్వ్‌ బ్యాంక్‌ కొత్త పాలనాధికారిగా ఎస్‌బీఐ మాజీ అధికారి ప్రశాంత్‌ కుమార్‌ను నియమించిన విషయం విదితమే. కుమార్‌ అధ్యక్షతన సమావేశంకానున్న బోర్డు ఈ నెల 14న క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌) ఫలితాలు విడుదల చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇతర వివరాలు చూద్దాం..

49 శాతం వాటా
త్వరలో యస్‌ బ్యాంక్‌ రిజల్యూషన్‌ ప్రణాళికను ప్రకటించనున్నట్లు దేశీ బ్యాంకింగ్‌ రంగ దిగ్గజం​ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ పేర్కొన్నారు. దీనిలో భాగంగా యస్‌ బ్యాంకులో ఎస్‌బీఐ 49 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. తద్వారా యస్‌ బ్యాంక్‌ బోర్డులో ఇద్దరు నామినీ డైరెక్టర్లను నియమించనుంది. తొలి దశలో భాగంగా ఎస్‌బీఐ రూ. 2450 కోట్లను యస్‌ బ్యాంకులో ఇన్వెస్ట్‌ చేయనుంది. తదుపరి మూడేళ్ల కాలంలో ఈ పెట్టుబడులను రూ. 10,000 కోట్లకు పెంచన్నుట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. కాగా.. యస్‌ బ్యాంకును నిలబెట్టేందుకు రూ. 20,000 కోట్ల పెట్టుబడులు అవసరమని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో బ్లాక్‌స్టోన్‌, బ్రూక్‌ఫీల్డ్‌, కార్లయిల్‌, టీపీజీ, కేకేఆర్‌, గోల్డ్‌మన్‌ శాక్స్‌ తదితర సంస్థలతో పెట్టుబడుల కోసం చర్చలు నడుస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ బాటలో ఎస్‌బీఐ సైతం యస్‌ బ్యాంకులో పెట్టుబడులకు వీలుగా గతంలో ఆసక్తి చూపిన టైడెన్‌ పార్క్‌, జేసీ ఫ్లవర్స్‌ తదితర సంస్థలతో సంప్రదింపులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. యస్‌ బ్యాంకులో మెజారిటీ వాటా 49 శాతాన్ని  కొనుగోలు చేసే సంస్థలు మూడేళ్లవరకూ వాటాను 26 శాతం లోపునకు తగ్గించుకునే వీలులేదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశాలు జారీ చేసింది. పునర్‌నిర్మాణ పథక చట్టం ప్రకారం ఇది వర్తించనున్నట్లు తెలుస్తోంది. కాగా..కొత్త పెట్టుబడులకు వీలుగా యస్‌ బ్యాంక్‌ అధీకృత మూలధనాన్ని రూ. 5000 కోట్లకు పెంచడంతోపాటు.. రూ. 2 ముఖ విలువగల ఈక్విటీ షేర్ల సంఖ్యను 2400 కోట్లకు చేర్చేందుకు అనుమతించిన విషయం విదితమే. యస్‌ బ్యాంకును టేకోవర్‌ చేయనున్న సంస్థ రూ. 2 ముఖ విలువ గల ఒక్కో షేరునీ రూ. 10కు తగ్గకుండా కొనుగోలు చేయవలసి ఉన్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. 
 You may be interested

37,000 దిగువన మరింత పతనం

Monday 9th March 2020

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ హఠాత్తుగా అరశాతం వడ్డీ రేటును తగ్గించడంతో పాటు పలు ప్రధాన కేంద్ర బ్యాంకులు ఉద్దీపనలకు సిద్ధంగా వున్నట్లు  ప్రకటించినప్పటికీ, కరోనావైరస్‌ పలు ప్రపంచదేశాల్లో తీవ్రంగా వ్యాప్తిచెందడంతో మార్కెట్ల పతనం కొనసాగుతూ వుంది. ఈ తరహా కేంద్ర బ్యాంకుల సాయం..   ఇన్వెస్టర్లను సమీప భవిష్యత్తులో శాంతింపచేస్తుందా అన్నది అనుమానమే. అమెరికా, చైనా, హాంకాంగ్‌ కేంద్ర బ్యాంకులు ఇప్పటికే హఠాత్‌ వరకూ  కురిపించినప్పటికీ, ఆయా

కోవిడ్‌ పరిణామాలే నడిపిస్తాయ్‌..

Monday 9th March 2020

కరోనా వైరస్‌ పైనే మార్కెట్‌ దృష్టి కీలకంగా మారిన యస్‌ బ్యాంక్‌  ఈ వారంలో ట్రేడింగ్‌ 4 రోజులకే పరిమితం హోలీ సందర్భంగా మంగళవారం మార్కెట్‌కు సెలవు న్యూఢిల్లీ: ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ (కోవిడ్‌–19) వల్ల ప్రపంచానికి పెద్ద ప్రమాదమే పొంచి ఉందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన తాజా సమాచారం ప్రకారణం ఈ వైరస్‌ బాధితుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా లక్ష దాటిపోగా, 3500 మందికిపైగా చనిపోయారు. ఈ స్థాయిలో విజృంభిస్తోన్న

Most from this category