News


9 ట్రేడింగ్‌ సెషన్లలో యస్‌బ్యాంక్‌ 50 శాతం జంప్‌

Tuesday 29th October 2019
news_main1572337843.png-29207

ప్రైవేట్‌ రంగానికి చెందిన యస్‌బ్యాంక్‌ షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో 9.50శాతం లాభపడ్డాయి. బీఎస్‌ఈలో నేటి ఉదయం ఈ షేర్లు రూ.54.45 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. మార్కెట్‌ ప్రారంభం నుంచి ఈ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒకదశలో షేర్లు 9.50శాతం లాభపడి రూ.59.90 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేశాయి. మధ్యాహ్నం గం.1:30ని.లకు యస్‌ బ్యాంక్‌ షేర్లు క్రితం ముగింపు ధర(రూ.54.75)తో పోలిస్తే 7.50శాతం లాభపడి రూ.58.85 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. బ్లూమ్‌బర్గ్‌ నివేదికల ప్రకారం 19 బ్రోకరేజ్‌ సంస్థలు ‘‘సెల్‌’’ రేటింగ్‌ను, 15 బ్రోకరేజ్‌ సంస్థలు ‘‘హోల్డ్‌’’ రేటింగ్‌ను, 8 బ్రోకరేజ్‌ సంస్థలు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించాయి.  గత ఈ షేర్లు 9 ట్రేడింగ్‌ సెషన్లలో 52శాతం ర్యాలీ (రూ.39 నుంచి రూ. 59 స్థాయికి) చేశాయి. ఈ నెల ప్రారంభం నుంచి 78.05శాతం లాభపడ్డాయి. కాగా షేర్లు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ.29.05లు, రూ.285.90లుగా నమోదయ్యాయి. 



You may be interested

ఎస్‌బీఐ షేరును ఏంచేద్దాం?

Tuesday 29th October 2019

బ్రోకరేజ్‌లు, నిపుణుల అంచనాలు, సూచనలు... సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాల అనంతరం వివిధ బ్రోకరేజ్‌లు ఎస్‌బీఐపై బుల్లిష్‌గా మారాయి. బ్యాంకు షేరుపై వివిధ సంస్థల అంచనాలు ఇలా ఉన్నాయి... 1. సీఎల్‌ఎస్‌ఏ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 390కి పెంచింది. పీఎస్‌యూల్లో ఎంచుకోదగిన షేరు. టెలికం రంగానికి ఎంత రుణాలిచ్చిందనేది ఒక్కటే రిస్కీ అంశం. సేవింగ్స్‌ డిపాజిట్స్‌ వృద్ధి 7 శాతానికి చేరడం విశేషం. క్రెడిట్‌ వ్యయాల కారణంగా ఎర్నింగ్స్‌ అంచనాలు తగ్గించింది. 2. హెచ్‌ఎస్‌బీసీ: కొనొచ్చు.

పన్నురేట్లను తగ్గించినంత మాత్రాన డిమాండ్‌ పుంజుకోదు

Tuesday 29th October 2019

-బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌లించ్‌, ఇండియా ఈక్విటీ స్ట్రాటజిస్ట్‌, సంజయ్‌ మూకిమ్‌  ‘సమీపకాలంలో డిమాండ్‌ పుంజుకోడానికి, ప్రభుత్వం కొత్తగా వ్యక్తిగత ఆదాయపు పన్నురేట్లను తగ్గిస్తుందని మార్కెట్‌ వర్గాలు అంచనావేస్తున్నాయి. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో ట్యాక్స్‌ను తగ్గించడానికి ప్రభుత్వానికి చాలా తక్కువ అవకాశం ఉంది’ అని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిల్‌ లించ్‌, ఇండియా ఈక్విటీ స్ట్రాటజిస్ట్‌ సంజయ్‌ మూకిమ్‌ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో తెలిపారు. అంతేకాకుండా ఫైనాన్సియల్స్‌, ఇండస్ట్రీయల్స్‌,

Most from this category