News


యస్‌ బ్యాంక్‌ డీలా- ఐఆర్‌సీటీసీ అప్‌

Tuesday 14th January 2020
Markets_main1578978739.png-30915

యస్‌ బ్యాంక్‌ షేరు 7 శాతం పతనం
4 శాతం జంప్‌చేసిన ఐఆర్‌సీటీసీ లిమిటెడ్‌

ఇటీవల సరికొత్త గరిష్టాలను తాకుతున్న దేశీ స్టాక్‌ మార్కెట్లు నేటి(14న) ట్రేడింగ్‌లో ఒడిదొడులకులను ఎదుర్కొంటున్నాయి. కొద్ది రోజులుగా ర్యాలీ చేయడంతో స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కన్సాలిడేట్‌ అవుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ట్రేడర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యమివ్వడం ప్రభావం చూపుతున్నట్లు తెలియజేశారు. ఉదయం 10.20 ప్రాంతంలో సెన్సెక్స్‌ 15 పాయింట్లు బలపడి 41,874కు చేరగా.. నిఫ్టీ 8 పాయింట్లు పుంజుకుని 12,338 వద్ద ట్రేడివుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల నేలచూపులతో కదులుతున్న ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌ కౌంటర్లో మరోసారి అమ్మకాలు ఊపందుకోగా.. మరోవైపు పీఎస్‌యూ దిగ్గజం ఐఆర్‌సీటీసీ కౌంటర్‌కు డిమాండ్‌ కనిపిస్తోంది. వివరాలు చూద్దాం..

యస్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌
ఇప్పటికే యస్‌ బ్యాంక్‌ షేరుకి ప్రకటించిన సెల్‌ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు తాజాగా దేశీ రీసెర్చ్‌ సంస్థ కొటక్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ పేర్కొంది. షేరుకి గతంలో ఇచ్చిన టార్గెట్‌ ధరను రూ. 55 నుంచి 40కు కోత పెడుతున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో యస్‌ బ్యాంక్‌ కౌంటర్‌డీలా పడింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో యస్‌ బ్యాంక్‌ షేరు 7 శాతం పతనమై రూ. 39.2 వద్ద ట్రేడవుతోంది. నిధుల సమీకరణ ఆలస్యంకావడం, మధ్యకాలానికి బ్యాంకు పనితీరు హెచ్చుతగ్గులకు లోనుకానున్న అంచనాలు టార్గెట్‌ ధరలో కోతకు కారణమైనట్లు కొటక్‌ ఈక్విటీస్‌ తెలియజేసింది. ఇటీవల మోర్గాన్‌ స్టాన్లీ సైతం నిధుల సమీకరణ అంశంపై ప్రతికూలంగా స్పందించడం గమనార్హం. కాగా.. వారాంతాన సమావేశమైన యస్‌ బ్యాంక్‌ బోర్డు వివిధ సెక్యూరిటీల జారీ ద్వారా రూ. 10,000 కోట్ల సమీకరణకు అనుమతించిన సంగతి తెలిసిందే. 

ఐఆర్‌సీటీసీ లిమిటెడ్‌
ముంబై సెంట్రల్‌ నుం‍చి అహ్మదాబాద్‌ వరకూ తేజాస్‌ ఎక్స్‌ప్రెస్‌ను నిర్వహించేందుకు రైల్వే శాఖ నుంచి అనుమతి లభించినట్లు పీఎస్‌యూ దిగ్గజం ఐఆర్‌సీటీసీ తాజాగా పేర్కొంది.  వారానికి ఆరు రోజులపాటు ఈ ట్రయిన్‌ను నడపనున్నట్లు తెలియజేసింది. ఈ నెల 19 నుంచీ వాణిజ్య పరంగా తేజాస్‌ ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఐఆర్‌సీటీసీ షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 971 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 978 వరకూ ఎగసింది.



You may be interested

రూ.39,500 దిగువకు బంగారం

Tuesday 14th January 2020

దేశీయంగా బంగారం ధర మంగళవారం రూ.39500 దిగువకు చేరుకుంది. అంతర్జాతీయంగా బంగారం ధరలు వారంరోజుల గరిష్టం నుంచి వెనక్కిరావడం, దేశీయ ఫారెక్స్‌మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ వరుసగా ఆరోరోజూ బలపడటంతో తదితర అంశాలు బంగారానికి డిమాండ్‌ను తగ్గించాయి. నిన్నరాత్రి ఎంసీఎక్స్‌ మార్కెట్‌ ముగింపు సరికి రూ.350లు నష్టపోయి రూ.39546 వద్ద స్థిరపడింది. నేడు రూ.39,500 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం ట్రేడింగ్‌లో 10గ్రాముల పసిడి ధర నిన్నటి ముగింపు

వేతన జీవులకు బడ్జెట్లో వరాలు?!

Tuesday 14th January 2020

రాబోయే బడ్జెట్లో ఉద్యోగులకు ఊరటనిచ్చే నిర్ణయాలు ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్దమైందని సంబంధిత వర్గాలు తెలిపాయి. వేతనజీవులకు రూ. 2.5 లక్షల వరకు 80 కేటగిరీ సేవింగ్స్‌ కింద పన్ను మినహాయింపునకు అవకాశం కల్పించనుందని, 80సీలో కొత్త విభాగం ఏర్పరిచి రూ. 50వేల వరకు ఎన్‌ఎస్‌సీల కొనుగోలుపై పన్ను మినహాయింపును ఇవ్వనుందని తెలిపాయి. దీంతో పాటు పీపీఎఫ్‌ ఇన్వెస్టర్లకు గరిష్ఠ పెట్టుబడి పరిమితి రూ. 2.5 లక్షల వరకు అనుమతించాలని యోచిస్తున్నట్లు

Most from this category