News


ఒడిదుడుకులమయంగా బ్యాంక్‌ నిఫ్టీ ట్రేడింగ్‌

Wednesday 18th September 2019
Markets_main1568794028.png-28407

బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ బుధవారం ఉదయం ట్రేడింగ్‌లో తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. నేడు ఇండెక్స్‌ క్రితం ముగింపు(27,131.75)తో పోలిస్తే 174 పాయింట్ల లాభంతో 27,304.70 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ఆరంభంలో బ్యాంకింగ్‌ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఇండెక్స్‌ ప్రారంభస్థాయి(27,304.70) నుంచి 216  పాయింట్లను నష్టపోయి 27,088.80 వద్ద ఇంట్రాడే కనిష్టానికి పతనమైంది. అనంతరం బ్యాంకింగ్‌ రంగ షేర్లకు మళ్లీ కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇండెక్స్‌ కనిష్టస్థాయి( 27,088.80)నుంచి 325 పాయింట్లు పెరిగి 27,414.45 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. మధ్యాహ్నం గం.12:30ని.లకు 187 పాయింట్లు( 0.70శాతం) లాభంతో 27,318.75 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో అత్యధికంగా ఎస్‌బీఐ బ్యాంక్‌ 2.70శాతం లాభపడింది. ఫెడరల్‌ బ్యాంక్‌ 2శాతం, కోటక్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు 1శాతం ర్యాలీ చేశాయి. అలాగే యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు అరశాతం నుంచి 0.10శాతం లాభపడ్డాయి. ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, యస్‌బ్యాంక్‌ షేర్లు పావుశాతం నుంచి 0.10శాతం వరకు నష్టపోయాయి.



You may be interested

వెలుగులోకి పెట్రోమార్కెటింగ్‌ షేర్లు

Wednesday 18th September 2019

పెట్రో మార్కెటింగ్‌ కంపెనీల షేర్లు గురువారం లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు చల్లారడం ఇందుకు కారణమవుతోంది.   తిరుగుబాటుదారుల డ్రోన్‌ దాడితో తగ్గిన చమురు ఉత్పత్తిని నెలాఖరులో పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తామని సౌదీ ప్రభుత్వం ప్రకటించడం అంతర్జాతీయంగా చమురు తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా ఈ రంగలో ప్రధాన షేర్లైన బీపీసీఎల్‌, హెచ్‌పీసీల్‌, ఐఓసీ షేర్లు 5.50శాతం నుంచి 2.50శాతం లాభపడ్డాయి. బీపీసీఎల్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.379.70ల వద్ద

ఎంఏసీడీలో 36 స్టాకుల బేరిష్‌ సంకేతాలు

Wednesday 18th September 2019

చమురు ఉత్పత్తిని ఈ నెల చివరి నాటికి పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తామని సౌదీ ప్రభుత్వం ప్రకటించడంతో పాటు యుఎస్‌ ఫెడ్‌ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలే నేపథ్యంలో దేశీయ స్టాకులు తిరిగి కోలుకుంటున్నాయి. కానీ విస్తృత మార్కెట్‌లో మాత్రం పాజిటివ్‌ మూమెంటం లేదని సాంకేతిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎంఏసీడీ (మూవింగ్‌ యావరేజ్‌ కన్వర్జన్స్‌, డైవర్జన్స్‌)సూచీ ఆధారంగా ఎన్‌ఎస్‌ఈలో కేవలం నాలుగు స్టాకులు మాత్రమే టెక్నికల్‌ చార్టులో బలంగా ఉన్నాయని, 36 స్టాకులలో

Most from this category