News


ఈ వారం స్టాక్స్‌ రికమెండేషన్స్‌

Monday 7th October 2019
news_main1570420301.png-28743

మహీంద్రా అండ్‌ మహీంద్రా     కొనచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌ 
ప్రస్తుత ధర: రూ.564
టార్గెట్‌ ధర: రూ.660

ఎందుకంటే:- ఫోర్డ్‌ ఇండియాతో ఏర్పాటు చేసిన జాయింట్‌ వెంచర్‌(జేవీ) మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీకి ప్రయోజనం కలిగించేదే. భారత్‌తో పాటు ఇతర వర్థమాన మార్కెట్లలో లాభదాయక వృద్ధిని కొనసాగించడానికి ఫోర్డ్‌ ఇండియాతో ఏర్పాటు చేసిన జేవీ తోడ్పడుతుంది. ఈ జేవీలో మహీంద్రా వాటా 51 శాతంగా, ఫోర్డ్‌ వాటా 49 శాతంగా ఉన్నాయి. రూ.1,925 కోట్ల ఎంటర్‌ప్రైజ్‌ విలువ, రూ.636 కోట్ల రుణ భారం ఉన్న ఈ జేవీలో 51 శాతం వాటా కోసం మహీంద్రా కంపెనీ  ప్రస్తుతం రూ.657 కోట్లు పెట్టుబడులు పెడుతోంది. ఈ జేవీ.. మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీకి విన్‌-విన్‌ డీల్‌ అని చెప్పవచ్చు. ఆర్థికంగా, వ్యూహాత్మకంగా ఈ డీల్‌ మహీంద్రా కంపెనీకి మేలు చేకూర్చేదే. ఫోర్డ్‌ కంపెనీకి చెందిన చెన్నై, సాణంద్‌(ఈ జేవీ నుంచి దీనిని మినహాయించారు) ప్లాంట్లు  ఏడాదికి 4.4 లక్షల వాహనాలను, 6.1 లక్షల ఇంజిన్లను ఉత్పత్తి చేస్తాయి. ఈ జేవీ కింద బ్యాటరీ ఎలక్ట్రిక్‌ వాహనాన్ని, రెండు బి-సెగ్మెంట్‌ ఎస్‌యూవీలను, ఒక మల్టీ పర్పస్‌ వెహికల్‌ను డెవలప్‌ చేస్తారు. ఈ జేవీ కారణంగా మహీంద్రా అండ్‌ మహీంద్రాకు ఉత్పత్తి వ్యయాలు  కలసివస్తాయి. విదేశాల్లో ఫోర్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ను వినియోగించుకునే వెసులుబాటు మహీంద్రా కంపెనీకి లభిస్తుంది. ట్రాక్టర్లు, యుటిలిటీ వెహికల్స్‌ విభాగాల్లో అత్యధిక మార్కెట్‌ వాటా మహీంద్రా కంపెనీదే. సమ్‌ ఆఫ్‌ ద పార్ట్స్‌(ఎస్‌ఓటీపీ) ప్రాతిపాదికన టార్గెట్‌ ధరను రూ.660గా నిర్ణయించాం. ఏడాది కాలంలో ఈ షేర్‌ ఈ ధరను చేరగలదని భావిస్తున్నాం. 

ఎన్‌ఎమ్‌డీసీ     కొనచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: ఎడెల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌
ప్రస్తుత ధర: రూ.96
టార్గెట్‌ ధర: రూ.140
ఎందుకంటే:-
 కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే 2015 నాటి మైనింగ్‌ నిబంధనలను సవరించింది. ఈ సవరణ ఎన్‌ఎమ్‌డీసీ కంపెనీకి ప్రయోజనకరమేనని చెప్పవచ్చు. కర్నాటకలోని దొనిమలై మైన్స్‌ పొడిగింపుకు ఆమోదాన్ని కర్నాటక ప్రభుత్వం గతంలో ఉపసంహరించుకుంది. తాజా సవరణల కారణంగా దొనిమలై మైన్స్‌ పొడిగింపునకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. ఎన్‌ఎమ్‌డీసీకి చెందిన ఇతర మైన్స్‌ గడువు పొడిగింపులకు కూడా ఆమోదం లభించవచ్చు. మైన్స్‌ రెన్యువల్స్‌ విషయంలో గతంలో ఉండే అనిశ్చితి పరిస్థితులకు తాజా సవరణలతో తెరపడింది. ఈ తాజా సవరణల కారణంగా కోల్‌ ఇండియా, జీఎమ్‌డీసీ, ఎమ్‌ఓఐఎల్‌, ఎన్‌ఎమ్‌డీసీ వంటి ప్రభుత్వ రంగ మైనింగ్‌ కంపెనీలకు ప్రయోజనం కలుగుతుంది.  మరోవైపు దొనిమలై మైన్స్‌ రెన్యువల్‌ కోసం 80 శాతం ప్రీమియమ్‌ను చెల్లించాలన్న కర్నాటక ప్రభుత్వ డిమాండ్‌ను కర్నాటక హైకోర్ట్‌ కొట్టివేయడం కూడా కంపెనీకి కలసివచ్చే అంశమే. మొత్తం మీద దొనిమలై మైనింగ్‌ లీజును రెన్యూవల్‌ చేసుకోవడానికి ఎన్‌ఎమ్‌డీసీ అదనంగా ఏమాత్రం ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. దొనిమలై గనుల్లో మైనింగ్‌ కార్యకలాపాలు మళ్లీ ప్రారంభమైతే ఎన్‌ఎమ్‌డీసీ ఉత్పత్తి 500 కిలో టన్నులు పెరుగుతుందని అంచనా. కంపెనీ షేర్‌ వారీ ఆర్జన(ఈపీఎస్‌) 12-15 శాతం మేర పెరుగుతుందని భావిస్తున్నాం. 



You may be interested

నష్టాల ప్రారంభం

Monday 7th October 2019

ప్రపంచ మార్కెట్ల ప్రతికూల సంకేతాల ఫలితంగా సోమవారం భారత్‌ స్టాక్‌ సూచీలు నష్టాలతో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 70 పాయింట్ల నష్టంతో 37,600 పాయింట్ల సమీపంలోనూ, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 30 పాయింట్ల గ్యాప్‌డౌన్‌తో 11,145 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యాయి. 

క్యూ2 ఫలితాలు, ఐఐపీ గణాంకాలే దిక్సూచీ

Monday 7th October 2019

టీసీఎస్‌, ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్ బ్యాంక్ ఫలితాలు ఈవారంలోనే.. ఆగస్టు పారిశ్రామికోత్పత్తి డేటా శుక్రవారం వెల్లడి అమెరికా-చైనా వాణిజ్య చర్చలపై ఇన్వెస్టర్ల దృష్టి బుధవారం ఎఫ్‌ఓఎంసీ మినిట్స్‌ వెల్లడి దసరా సందర్భంగా మంగళవారం మార్కెట్‌కు సెలవు న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్‌ కంపెనీల క్యూ2 ఫలితాల ప్రకటన, స్థూల ఆర్థిక అంశాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌కు దిశానిర్దేశం చేయనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ

Most from this category