News


సాంక్టమ్‌ వెల్త్‌ టాప్‌ సిఫార్సులు

Friday 20th December 2019
Markets_main1576816687.png-30332

వచ్చే మూడు నాలుగు వారాలకు మంచి రాబడినిచ్చే మూడు స్టాకులను సాంక్టమ్‌ వెల్త్‌ రికమండ్‌ చేస్తోంది.
1. పీవీఆర్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 2070. స్టాప్‌లాస్‌ 1740. జూలైలో వేగంగా పతనమై ఆగస్టు నాటికి రూ.1348 కనిష్ఠానికి వచ్చింది. అక్కడ నుంచి తిరిగి వేగంగా పెరిగి సెప్టెంబర్‌లో ఆల్‌టైమ్‌ హై రూ. 1898ని తాకింది. ఆపై కరెక‌్షన్‌, కన్సాలిడేషన్‌ మూడ్‌లోకి మరలింది. ప్రస్తుతం షేరు ధర కీలక డీఎంఏలకు పైన ఉంది. త్వరలో అప్‌ట్రెండ్‌ కొనసాగించే సంకేతాలు ఇస్తోంది. ఆర్‌ఎస్‌ఐ, ఎంఏసీడీలు పాజిటివ్‌ క్రాసోవర్లు ఏర్పరిచాయి. 
2. మహానగర్‌ గ్యాస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1200. స్టాప్‌లాస్‌ రూ. 1030. రెండేళ్ల క్రితం ఆల్‌టైమ్‌ హైని తాకి అనంతరం రూ. 755 స్థాయిలకు దిగజారింది. అప్పటినుంచి రూ.1050- 750 రేంజ్‌లో కదలాడుతోంది. ఈ కన్సాలిడేషన్‌లో భాగంగా డబుల్‌ బాటమ్‌ ఏర్పరిచింది. ప్రస్తుతం బ్రేకవుట్‌ పాయింట్‌కు దగ్గరగా కదలాడుతోంది. బోలింగర్‌ బ్యాండ్‌లో ప్రైస్‌ అప్‌మూవ్‌ కనిపిస్తోంది. 
3. కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 600. స్టాప్‌లాస్‌ రూ. 490. గతేడాది ఆల్‌టైమ్‌ హైని తాకి తదనంతరం రూ. 340కి పడిపోయింది. తిరిగి కొంత పుంజుకున్నా ఈ ఏడాది ఆగస్టులో మరలా అదే స్థాయిలకు పతనమైంది. దీంతో డబుల్‌ బాటమ్‌ ఏర్పడింది. ఏంఏసీడీ ఇండికేటర్‌ పాజిటివ్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. 



You may be interested

2వారాల గరిష్టం వద్ద పసిడి

Friday 20th December 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ఫ్యూచర్ల ధర 2వారాల గరిష్టం వద్ద స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ట్రంప్‌ అభిశంసనకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలపడటం ఇందుకు కారణమైంది. అధ్యక్షుడు ట్రంప్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడటంతో పాటు అమెరికా కాంగ్రెస్‌ను అడ్డుకున్నారనే ఆరోపణలతో ప్రత్యర్ది పార్టి డెమోక్రటిక్‌ సభ్యులు ట్రంప్‌ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దిగువ సభలో డెమోక్రాట్లదే ఆధిపత్యం అయిన నేపధ్యంలో అభిశంసన తీర్మానానికి ఆమోదం లభించింది. సెనెట్‌(ఎగువ)లోనూ తీర్మానానికి ఆమోదం

బజాజ్ ఫైనాన్స్ స్వాధీనంలోకి 'కార్వీ డేటా' షేర్లు

Friday 20th December 2019

న్యూఢిల్లీ: కార్వీ గ్రూప్ సంస్థకి ఇచ్చిన రుణాలు రాబట్టుకునే క్రమంలో కార్వీ డేటా మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్ (కేడీఎంఎస్ఎల్) తనఖా ఉంచిన 24 లక్షల షేర్లను స్వాధీనం చేసుకున్నట్లు బజాజ్ ఫైనాన్స్ వెల్లడించింది. ఇది కేడీఎంఎస్‌ఎల్‌ పెయిడప్ క్యాపిటల్‌లో 10 శాతం వాటాకు సమానం. గ్రూప్ సంస్థ కార్వీ స్టాక్ బ్రోకింగ్‌ (కేఎస్‌బీఎల్‌) తీసుకున్న రుణాల కోసం కేడీఎంఎస్ఎల్ ఈ షేర్లను తనఖా ఉంచింది. వీటి ముఖ విలువ రూ. 10.

Most from this category