News


ఈ వారం స్టాక్‌ రికమెండేషన్లు

Monday 2nd September 2019
Markets_main1567402919.png-28148

హెచ్‌డీఎఫ్‌సీ     కొనచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: షేర్‌ఖాన్‌ 
ప్రస్తుత ధర: రూ.2,167
టార్గెట్‌ ధర: రూ.2,500

ఎందుకంటే:- హౌసింగ్‌ ఫైనాన్స్‌కంపెనీలకు నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంక్‌ (ఎన్‌హెచ్‌బీ) ద్వారా అదనంగా రూ.20,000 కోట్ల నిధులు అందుబాటులోకి తేవాలని కేంద్ర  ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఇలాంటి ప్రభుత్వ ఉద్దీపన చర్యల వల్ల  హెచ్‌డీఎఫ్‌సీ వంటి బలమైన హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు మేలు కలుగుతుంది. ప్రభుత్వ ప్యాకేజీ చర్యల కారణంగా ఈ కంపెనీకి నిధుల వ్యయం తగ్గుతుంది. ఫలితంగా వడ్డీరేట్లపై ఒత్తిడి తగ్గుతుంది. కంపెనీ ఫండమెంటల్స్‌ పటిష్టంగా ఉండటం... పటిష్టమైన లాభదాయకమైన వృద్ధికి దోహదపడుతుంది. ఒక వేళ నిధుల వ్యయం అర శాతం పెరిగినప్పటికీ, ఈ కంపెనీ నికర వడ్డీ మార్జిన్‌ 3.3 శాతం రేంజ్‌లోనే కొనసాగగలదని అంచనా వేస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరం అంచనా పుస్తక విలువకు 4 రెట్ల ధరకు ప్రస్తుతం ఈ షేర్‌ ట్రేడవుతోంది. ఫండమెంటల్స్‌, నిర్వహణ తీరు పటిష్టంగా ఉన్న ఈ షేర్‌కు ఇది సమంజసమైన ధరే అని భావిస్తున్నాం. క్యాపిటల్‌ అడెక్వసీ రేషియో అధికంగా ఉండటం, మొండి బకాయిలు తక్కువగా ఉండటం (1.3 శాతం లోపే ), క్రిసిల్‌, ఇక్రా వంటి రేటింగ్‌ సంస్థల నుంచి ట్రిపుల్‌ ఏ రేటింగ్‌ సాధించడం, రుణ మార్కెట్లో ఈ కంపెనీ మార్కెట్‌ వాటా పెరుగుతుండటంతో నిర్వహణ ఆస్తుల వృద్ధి ఆరోగ్యకరంగా ఉండగలదన్న అంచనాలు.. ఇవన్నీ సానుకూలాంశాలు. అందుకని ఈ షేర్‌కు కొనచ్చు రేటింగ్‌ను కొనసాగిస్తున్నాం. ఏదైనా రియల్టీ కంపెనీ డిఫాల్ట్‌ అయితే, అది ఈ కంపెనీపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చు. 


పీవీఆర్‌     కొనచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: ఎడెల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌
ప్రస్తుత ధర: రూ.1,542
టార్గెట్‌ ధర: రూ.2,040
ఎందుకంటే:-
భారత్‌లో అతి పెద్ద మల్టిప్లెక్స్‌ కంపెనీగా 625 స్క్రీన్లతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పీవీఆర్‌ పిక్చర్స్‌(అనుబంధ కంపెనీ) పేరుతో సినిమా డిస్ట్రిబ్యూషన్‌ వ్యాపారాన్ని కూడా నిర్వహిస్తోంది. విడుదలైన రోజే సినిమాలను ఇంట్లో చూసే రియలన్స్‌ జియో ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో సర్వీస్‌ ప్రభావం పీవీఆర్‌ వంటి మల్టీప్లెక్స్‌ సంస్థలపై పెద్దగా ఉండకపోవచ్చని భావిస్తున్నాం. ఈ ఫీచర్‌ను ఇప్పటికే ఎగ్జిబిటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చినా, ఎక్కువ సంఖ్యలో  సినిమాలు డిజిటల్‌ ప్లాట్‌ఫార్మ్‌పై తొలిరోజే వీక్షకులకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ఈ విషయమై పూర్తిగా ఒక అభిప్రాయానికి రావడానికి మరికొంత కాలం వేచి చూడాల్సి ఉంది.  ఐపీఎల్‌, ప్రపంచ కప్‌​క్రికెట్‌ పోటీలు జరిగిన కాలంలో కూడా ఈ కంపెనీ ఆదాయం 26 శాతం వృద్ధి చెందింది. జీ టీవీ, సన్‌ టీవీల ప్రకటనల ఆదాయం అంతంతమాత్రం వృద్ధి సాధించినా, పీవీఆర్‌ కంపెనీ ప్రకటనల ఆదాయం 28 శాతం ఎగసింది. అయితే ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మాంద్యం ఈ కంపెనీ ప్రకటనల ఆదాయంపై కూడా ప్రభావం చూపించవచ్చు. పీవీఆర్‌ మొత్తం ఆదాయంలో 11-12 శాతంగా ఉన్న ప్రకటనల ఆదాయం తగ్గితే ఈ కంపెనీ నిర్వహణ లాభం తగ్గవచ్చు. మధ్య, చిన్న తరహా నగరాల్లో  పీవీఆర్‌ ఉత్సవ్‌ పేరుతో చౌక ధరలకే సినిమాలు చూపించే స్క్రీన్లను అందుబాటులోకి తెస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌లో 22 కొత్త స్క్రీన్లను ప్రారంభించింది.   ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 80కు పైగా కొత్త  స్క్రీన్లను అందుబాటులోకి తేనున్నది. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో సమస్యలున్నప్పటకీ, స్క్రీన్ల విస్తరణలో పెద్దగా సమస్యలు ఎదురు కాకపోవచ్చని భావిస్తున్నాం. రిలయన్స్‌ జియో ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో సర్వీస్‌, నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వంటి ఓటీటీ(ఓవర్‌ ద టాప్‌) సర్వీసులు పెరుగుతుండటం, ఆర్థిక మాంద్యం ప్రభావం, మల్టీప్లెక్స్‌ రంగంలో పోటీ పెరుగుతుండటం......ప్రతికూలాంశాలు. You may be interested

వైవిధ్యమైన పెట్టుబడులు కోసం

Monday 2nd September 2019

డి.జయంత్‌ కుమార్‌, థర్డ్‌ పార్టీ ప్రొడక్ట్స్‌ హెడ్‌, కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌  గడిచిన ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల కాలంలో మార్కెట్లు తీవ్ర అస్థిరతలను ఎదుర్కొన్నాయి. ఈ పరిస్థితి మరికొంత కాలం పాటు కొనసాగే అవకాశం లేకపోలేదు. దీంతో ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడుల విషయమై ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ అస్థిరతలు దీర్ఘకాలంలో సంపద సృ‍ష్టికి దారితీసేవే అయినప్పటికీ, స్వల్ప కాలంలో ఎదురయ్యే నష్టాలు ఇబ్బంది పెడతాయి. రిస్క్‌కు విముఖంగా

ఆన్‌లైన్‌లో ఔషధాలు... ఇవి తెలుసుకోవాల్సిందే!

Monday 2nd September 2019

నిమిషాల్లో ఆర్డర్‌ ఇచ్చేయవచ్చు ఇంటికే నేరుగా ఔషధాల డెలివరీ ఎంఆర్‌పీపై భారీగా డిస్కౌంట్‌ కాకపోతే డెలివరీకి ఎక్కువ సమయం సంప్రదాయ దుకాణాల్లో డిస్కౌంట్‌ తక్కువే వెంటనే ఔషధాలు కావాలంటే ఇవే మార్గం డాక్టర్‌ రాసిన మందుల చీటిని ఫోన్‌ కెమెరా నుంచి క్లిక్‌ మనిపించి, దాన్ని మొబైల్‌ యాప్‌ నుంచి అప్‌లోడ్‌ చేసి, చిటికెలో ఆర్డర్‌ చేసేయడం... ఆ తర్వాత 24 గంటల నుంచి 48 గంటల్లోపు ఇంటికే ఔషధాలు వచ్చేయడం నేడు పట్టణాల్లో చూస్తున్నాం. చిన్న పట్టణాల

Most from this category